అంతర్జాతీయం

జపాన్ ప్రధానితో మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంబర్గ్, జూలై 8: జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జపాన్ ప్రధాని షింజే అబేతో భేటీ అయి ఇరు దేశాల సంబంధాల పురోగతిని సమీక్షించారు. వివాదాస్పద దక్షిణ, తూర్పు సముద్రాల్లో చైనా మిలటరీ ఆధిపత్యం పెరిగిపోతున్న తరుణంలో ఇరు దేశాలు మలబార్ నౌకాదళ విన్యాసాలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరువురు నేతలు సమావేశం కావడం గమనార్హం. 2016 నవంబర్‌లో ప్రధాని పర్యటన సందర్భంగా జపాన్‌లో ఇరువురు నేతలు భేటీ అయినప్పటినుంచి ముఖ్యమైన ప్రాజెక్టులు సహా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని ఇరువురు నేతలు క్లుప్తంగా సమీక్షించుకున్నారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి వార్షిక శిఖరాగ్ర సమావేశంకోసం వచ్చే ఏడాది అబే భారత్ సందర్శనకోసం తాము ఎదురు చూస్తున్నామని ప్రధాని ఈ సందర్భంగా అన్నట్లు ఆ ప్రకటన తెలిపింది. బంగాళాఖాతంలో ఈ నెల 10నుంచి జరగనున్న మలబార్ నౌకా విన్యాసాల్లోఅమెరికా, జపాన్, భారత దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములు పాలు పంచుకోనున్నాయి.
కాగా, జి-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్‌తో సమావేశమైన మోదీ తమ జాతీయ పెట్టుబడులు, వౌలిక సదుపాయాల నిధిలో పెట్టుబడులు పెట్టాలని నార్వేకు చెందిన పెన్షన్ ఫండ్స్‌ను ఆహ్వానించారు. ఆయన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జాయే-ఇన్, ఇటలీ ప్రధాని పావ్‌లో జెంటిలోని, అర్జెంటీనా అధ్యక్షుడు వౌరిసియో మాక్రితోను ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు మూన్‌కు మోదీ అభినందనలు తెలిపారు. విజయం సాదించినందుకు తనను అభినందిస్తూ మోదీ చేసిన ఫోన్ కాల్‌ను కొరియా భాషలో చేసిన ట్వీట్‌ను మూన్ గుర్తు చేసుకుంటూ, తమ దేశ ప్రజలు దీన్ని ఎంతో సాదరంగా స్వీకరించారని చెప్పారు. ఇటలీ ప్రధానితో మోదీ చర్చలు ద్వైపాక్షిక సంబంధాలు ముఖ్యంగా వాణిజ్య సంబంధాల పెంపు మార్గాలపై దృష్టిపెట్టాయి. ఈ ఏడాది నవంబర్‌లో భారత్‌లో జరగనున్న అంతర్జాతీయ ఫుడ్ ప్రాసెసింగ్ ఎగ్జిబిషన్‌లో ఇటలీ పాల్గొనాలంటూ ప్రధాని ఆహ్వానించారు. నార్వే అధ్యక్షుడు సోల్‌బెర్గ్‌తో జరిగిన చర్చల్లో ద్వైపాక్షిక అంశాలు ముఖ్యంగా ఆర్థిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. తమ జాతీయ ఇనె్వస్టమెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా నార్వే పెన్షన్ ఫండ్స్‌ను ప్రధాని ఆహ్వానించారు.
మోదీ-ట్రంప్ ఆకస్మిక భేటీ
జి-20 శిఖరాగ్ర సమావేశాలకోసం అగ్రరాజ్యాల నేతలంతా ఒకచోట చేరిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకోకుండా ప్రధాని మోదీ వైపు చూసి చేతులూపడమే కాక, ఆయన వద్దకు నడిచి వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. సదస్సులో భారత్‌కు మార్గదర్శి, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా మోదీ-ట్రంప్ సంభాషణ గురించి ట్వీట్ చేశారు. మోదీ, ట్రంప్ కలుసుకొన్నప్పటి ఫోటోలతో పాటుగా ఇతర నేతలతో మోదీ భేటీ ఫోటోలను కూడా ఆయన ట్విట్టర్‌లో ఉంచారు.