అంతర్జాతీయం

భారత్ సంస్కరణలకు.. జీ-20 జై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంబర్గ్, జూలై 9: సుస్థిర అభివృద్ధి, సమీకృత వృద్ధికి భారత్ చేపడుతున్న చర్యలను జీ-20 పారిశ్రామిక దేశాలు జై కొట్టాయి. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి భారత్‌ను వృద్ధి కేంద్రంగా మార్చేందుకు మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యల్ని శిఖరాగ్ర సదస్సులో చేపట్టిన హంబర్గ్ కార్యాచరణ ప్రణాళికలో కీర్తించాయి. కార్మిక సంస్కరణలు, వ్యాపారానుకూల పరిస్థితుల్ని పెంపొందించేందుకు భారత్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ ఊతాన్నిచ్చేవిగా ఉన్నాయని శ్లాఘించాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ మూలాలను పటుతరంగా మార్చేందుకు, ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకునేందుకు అనేక రకాలుగా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికలనూ ఏర్పాటు చేస్తోందని తెలిపింది. సంస్థాగత సంస్కరణలు, సుస్థిర వృద్ధి రేటే లక్ష్యంగా జి-20 దేశాలు తీసుకుంటున్న చర్యలకు భారత్ నిర్ణయాలు అనేక రకాలుగా బలాన్నిస్తున్నాయని ఆ కార్యాచరణ ప్రణాళికలో తెలిపింది. కార్మికులకు భద్రత కల్పించేందుకు, కార్మిక శక్తిలో మహిళల ప్రమేయాన్ని పెంచేందుకూ కూడా భారత్ ఎన్నో సంస్కరణలను చేపట్టిందని తెలిపింది. భారత్‌ను వ్యాపారానుకూల దేశంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో జి-20 దేశాలు కితాబు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచ రేటింగ్‌లో భారత్‌ను టాప్-50లో చేర్చడమే లక్ష్యంగా సర్కార్ అన్ని రంగాల్లోనూ సంస్కరణలను చేపడుతోంది.