అంతర్జాతీయం

ఈ కేక్ ఖరీదు రూ.16 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, జూలై 9: దుబాయిలోని ఓ బేకరీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదయిన కేక్‌ను తయారు చేసిందని, దీని తయారీకి ఏకంగా 25 వేల డాలర్లు (రూ. 16 లక్షలకుపైగా) ఖర్చయినట్లు ఆదివారం ఓ మీడియా కథనం పేర్కొంది. నాలుగడుగుల ఎత్తుండే ఈ కేక్‌ను పూర్తిగా చక్కెర పాకం, చక్కెర పేస్ట్‌తో తయారు చేశారు. 32 కిలోల బరువుండే దీన్ని వందనుంచి 120 మందికి వడ్డించవచ్చని ఈ కేక్‌ను తయారు చేసిన బ్రాడ్‌వే బేకరీ తెలిపింది. హాలీవుడ్ చిత్రం ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’లో క్యారెక్టర్ టిరియన్ లానిస్టర్‌కు నివాళిగా దుబాయిలో ఈ స్పాంజ్ కేక్‌ను తయారు చేసినట్లు ‘గల్ఫ్‌న్యూస్’ పత్రిక తెలిపింది. 91,800 దిర్హామ్‌లు (16.15 లక్షల రూపాయలు) ఖర్చయిన ఈ ప్రత్యేక కేక్‌ను ఎలా తయారు చేశారో యూ ట్యూబ్‌లో ఉంచిన ఒక వీడియోలో ఆ సంస్థ తెలియజేసింది. పని తనానికి ప్రతీకగా నిలిచిన ఈ స్పాంజ్ కేక్‌పైన ఒక ఐరన్ సింహాసనంపై కూర్చుని ఉన్న టిరియన్ ముఖం, శరీరాన్ని కూడా చిత్రీకరించారు. పూర్తిగా దీన్ని చక్కెర పాకం (్ఫండెంట్)తో తయారు చేసినట్లు కూడా ఆ సంస్థ తెలిపింది. 30నుంచి 32 కిలోల బరువుండే ఈ కేక్‌ను సులభంగా వందనుంచి 120 మందికి సర్వ్ చేయవచ్చని కూడా బేకరీ ఒక ప్రకటనలో తెలిపింది.