అంతర్జాతీయం

ఐసిస్ నుంచి మోసుల్‌కు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోసుల్, జూలై 9: నెలల తరబడి ఐసిస్ ఉగ్రవాదులతో సాగిన పోరాటానికి చరమగీతం పడి మోసుల్ పట్టణం విముక్తం అయిందని ఇరాక్ ప్రధాన మంత్రి హైదర్ అల్ అబ్దాదీ ప్రకటించారు. ఆదివారంనాడు ఈ పట్టణంలో పర్యటించిన ఆయన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పట్టణాన్ని ఐసిస్ మిలిటెంట్ల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దాదాపు 9 నెలలపాటు అమెరికా సాయంతో ఇరాక్ దళాలు పోరాటం చేయాల్సి వచ్చింది. దాదాపు మూడేళ్లపాటు ఈ పట్టణానే్న కేంద్రంగా చేసుకుని జిహాదీలు తమ సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అయితే ఐసిస్ నుంచి ఈ పట్టణానికి విమోచనం కలిగినప్పటికీ ఇప్పటికీ కూడా అడపా దడపా కాల్పులు వినిపిస్తూనే ఉన్నాయని ప్రధాన మంత్రి కార్యాలయం ఈ తాజా ప్రకటన జారీచేసిన సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. 2014లోనే ఇరాక్‌ను దాదాపుగా హస్తగతం చేసుకోవడానికి ఐసిస్ ప్రయత్నించింది. అనేక పట్టణాలను తన గుప్పెట్లోకి తెచ్చుకుంది.