అంతర్జాతీయం

ల్యాబ్‌లో ‘సూపర్‌నోవా’ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 9: విశ్వం ఆవిర్భావానికి కారణమైన విస్ఫోటనం (సూపర్‌నోవా)ను శాస్తవ్రేత్తలు ల్యాబ్‌లో అత్యంత శక్తివంతమైన లేజర్ రేస్‌ను ఉపయోగించి ప్రతిసృష్టి చేశారు. విశ్వం పుట్టుక ఓ శక్తివంతమైన విస్ఫోటనంతో జరిగింది, ఆ సందర్భంలో ఎన్నో నక్షత్రాలు తునాతునకలై హైడ్రోజన్, హీలియంల కంటే ఎన్నో రెట్లు బరువైన మూల వస్తువులను అంతరిక్షంలో వెదజల్లాయి. దీనినుంచి ఆవిర్భవించిందే మన సౌర కుటుంబం. ఈ సూపర్‌నోవా నుంచే అణువు ఆవిర్భవించింది, ఆ అణువే ప్రాణుల పుట్టుకకు అంకురార్పణమైంది. ఇక్కడి రాయల్ సొసైటీ నిర్వహించిన సమ్మర్ సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్తవ్రేత్తలు అబ్బురపరిచే రీతిలో సూపర్‌నోవాను కళ్లకు కట్టినట్టు చూపించారు. సూపర్‌నోవాను అత్యంత శక్తివంతమైన లేజర్ రేస్‌ను ఉపయోగించి ల్యాబ్‌లో పునరావిష్కరించడం, విశ్వం పుట్టుక రహస్యాలపై సందర్శకులకు అవగాహన కల్పించడం ఎంతో సాహసంతో కూడిన ప్రయోగం. దీని ద్వారా సౌర కుటుంబం, మానవావిర్భావం, ప్రకృతిలో చోటుచేసుకుంటున్న మార్పులపైనే కాకుండా మొత్తం విశ్వం ఎలా ఏర్పడిందన్న రహస్యాలను తెలుసుకునేందుకు ఎంతో దోహదపడుతుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్తవ్రేత్త జీనా మెనిక్ తెలిపారు.