అంతర్జాతీయం

గ్రీన్‌కార్డు కావాలా..? 12 ఏళ్లు ఆగండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 11: విదేశీయులెవరైనా అమెరికాలో స్థిరపడాలనుకుంటే గ్రీన్‌కార్డు తప్పనిసరనే విషయం తెలిసిందే. అయితే గ్రీన్‌కార్డుకోసం భారతీయులు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే మరో 12 ఏళ్లకు కానీ గ్రీన్‌కార్డు రాదని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. 2015లో దాదాపు 36,318 మంది భారతీయులు తమ నివాసాన్ని చట్టబద్ధ శాశ్వత నివాసంగా మార్పు చేసుకోగా, 27,798 మంది కొత్తగా గ్రీన్‌కార్డు రూపంలో చట్టబద్ధమైన శాశ్వత నివాస ధ్రువీకరణను అందుకున్నారని ‘ప్యూ రిసెర్చ్’ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది. వీళ్లంతా కూడా నైపుణ్యం ఉన్న కార్మికులేనని కూడా ఆ నివేదిక పేర్కొంది. అలాగని భారతీయులకు గ్రీన్‌కార్డుల జారీ తక్కువేమీ కాదు. అయితే దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతుండడమే ఈ పరిస్థితికి కారణం. అందువల్ల ఇప్పుడు దరఖాస్తు చేసుకునేవారు 12 సంవత్సరాలపాటు వేచి ఉంటే తప్ప గ్రీన్‌కార్డు వచ్చే అవకాశం లేదని ఆ నివేదిక తెలిపింది. వాస్తవానికి 2005లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పుడు గ్రీన్‌కార్డులు జారీ చేసే ప్రకియ కొనసాగుతోందని కూడా ఆ సంస్థ తెలిపింది. 2010నుంచి 2014 ఆర్థిక సంవత్సరం దాకా జారీ చేసిన మొత్తం ఉద్యోగానికి సంబంధించిన గ్రీన్‌కార్డుల్లో 36 శాతం అంటే 2,22,000కు పైగా హెచ్-1బి వీసాకార్డు హోల్డర్లే ఉన్నారని కూడా ఆ నివేదిక తెలిపింది.
గ్రీన్‌కార్డు కలిగి ఉన్నవారు అయిదేళ్లపాటు నివసిస్తే అమెరికా పౌరసత్వంకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదే అమెరికా జాతీయుల్ని పెళ్లి చేసుకున్న వారయితే మూడేళ్లకే పౌరసత్వంకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా తమ హోదాను సర్దుబాటు చేసుకున్నవారిలో 72 శాతం మంది ఉద్యోగార్హత అయిన 25 నుంచి 64 ఏళ్లలోపు వయసున్నవారే. అదే కొత్తగా వచ్చినవారు గ్రీన్‌కార్డు కలిగి ఉండి పౌరసత్వం పొందినవారు 55 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఉదాహరణకు 2015లో తమ పౌరసత్వాన్ని సర్దుబాటు చేసుకున్నవారు 5,42,315 మంది ఉంటే కొత్తగా చట్టబద్ధ పౌరసత్వం పొందిన వారు 5,08,716 మంది ఉన్నారు. 2004నుంచి కూడా అమెరికా కొత్తగా దేశంలోకి వచ్చిన వారికన్నా కూడా ఇతర వీసాలపై దేశంలో నివసిస్తున్న వారి పౌరసత్వాలనే ఎక్కువగా సర్దుబాటు చేసింది. 2004నుంచి ఇప్పటివరకు ఇతర వీసాలపై అమెరికాలో ఉంటున్న మొత్తం 74 లక్షలమంది తమ పౌరసత్వాలను శాశ్వతమైనవిగా మార్పిడి చేసుకోగా, 55 లక్షల మంది మాత్రమే కొత్తవాళ్లు గ్రీన్‌కార్డు రూపంలో చట్టబద్ధ శాశ్వత పౌరసత్వాన్ని పొందారు.