అంతర్జాతీయం

గాంధీజీ చిత్రపటానికి 32,500 పౌండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 11: పెన్సిల్‌తో గీసిన జాతిపిత మహాత్మాగాంధీ అరుదైన చిత్రపటానికి లండన్‌లోని ఓ వేలం కేంద్రంలో 32,500 పౌండ్లు ధర పలికింది. అది 1931నాటి చిత్తరువు. అనుకున్నదానికి కంటే నాలుగు రెట్లు ఎక్కువ ధర లభించినట్టు నిర్వాహకులు వెల్లడించారు. చిత్రపటంతోపాటు మహాత్మాగాంధీ స్వహస్తాలతో రాసిన ఉత్తరాలతో కలిపి 37,500 పౌండ్లకు వేలం వేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ సోదరుడు శరత్ చంద్రబోస్‌కు గాంధీ రాసిన లేఖలు అందులో ఉన్నాయి. ‘సాధారణంగా గాంధీజీ ఫొటోలకు దూరంగా ఉండేవారు. అలాంటిది పెన్సిల్‌తో చిత్రించిన బొమ్మ అరుదైనదేనని చెప్పవచ్చు’ అని వేలం కేంద్రం నిర్వాహకులు పేర్కొన్నారు. మహాత్ముడు నేలపై కింద కూర్చుని ఏదో రాస్తున్నప్పుడు గీసిందా చిత్రం. పటంపై ‘ట్రూత్ ఈజ్ గాడ్/ఎంకె గాంధీ/4.12.31’ అని ఉంది. మహాత్ముడు రౌండ్ టేబుల్ సమావేశం నిమిత్తం 1931లో లండన్ వచ్చినప్పుడు ప్రముఖ చిత్రకారుడు జాన్ హెన్రీ అమ్షెవిట్జ్ ఈ చిత్రాన్ని గీశారు. భారత రాజ్యాంగం సంస్కరణలకు సంబంధించి బ్రిటిష్ ప్రభుత్వం అనేకసార్లు సమావేశాలు ఏర్పాటు చేసేది. దీనికి గాంధీజీ హాజరవుతూ ఉండేవారు. లండన్ వచ్చినప్పుడు కింగ్స్‌లే హాలులో గాంధీజీ బసచేసేవారు.