అంతర్జాతీయం

మూగబోయిన చైనా ప్రజాస్వామ్య గళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 13: చైనా ప్రజాస్వామ్య ఉద్యమకారుడు, నోబెల్ బహుమతి శాంతి బహుమతి గ్రహీత లియు జియాబో(61) గురువారం తుది శ్వాస విడిచారు. కేన్సర్‌తో బాధడుతున్న ఆయనను నెల రోజుల క్రితమే చికిత్స నిమిత్తం చైనా ప్రభుత్వం ఓ ఆసుపత్రికి తరలించింది. లియును విడుదల చేసి కేన్సర్ చికిత్సకు విదేశాలకు పంపాలన్న ప్రపంచ దేశాల విజ్ఞప్తిని చైనా తిరస్కరించింది. మూడు రోజుల క్రితమే లియును చైనా మెడికల్ యూనివర్శిటీ ఆసుపత్రి ఐసియుకి తరలించామని అధికార వర్గాలు తెలిపాయి. చైనా కమ్యూనిస్టు పాలకులు అనుసరిస్తున్న అణచివేత విధానాలకు వ్యతిరేకంగా దశాబ్దాల పాటు పోరాడిన లీయు మరణంతో బలమైన ప్రత్యర్థి గళం శాశ్వతంగా మూగబోయింది. కారాగార వాసంలోనే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణించడం ఇదే మొదటి సారి కాదు. 1938లో కార్ల్ ఓన్ ఓసిజీ నాజీ నిర్బంధంలోనే మరణించారు. తన చివరి రోజుల్లో విదేశాల్లో చికిత్సపొందేందుకు అనుమతించాలని లియు చేసిన అభ్యర్థనను మన్నించాలంటూ అంతర్జాతీయ మానవ హక్కుల బృందాలు, పశ్చిమ దేశాలు బృందాలు చైనాకు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది. లీయును పంపిస్తే తామే చికిత్స చేస్తామంటూ జర్మనీ ముందుకు వచ్చింది. అందుకు తామూ సిద్ధమేనని అమెరికా కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. కానీ తమ దేశంలో ఆయనకు అత్యున్నత స్థాయి చికిత్స అందిస్తున్నామంటూ ఈ దేశాల అభ్యర్థను చైనా తిరస్కరించింది.