అంతర్జాతీయం

రాజీనామా ప్రసక్తేలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 13: పనామా కేసులో ప్రతికూల వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తిరస్కరించారు. పనామా కేసును దర్యాప్తు చేసిన ప్యానెల్ నవాజ్‌షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి కేసును నమోదు చేయాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించిన నవాజ్ షరీఫ్ ఈ దర్యాప్తు ప్యానెల్ నివేదికను ఆరోపణలు, ఊహాగానాల మయంగా అభివర్ణించారు. తనను దేశ ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నది పాకిస్తాన్ ప్రజలని, తనను తొలగించాల్సింది కూడా వారేనని షరీఫ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తన కుటుంబం సంపాదించుకున్నది ఏమీలేదని, ఎంతో కోల్పోయిందని చెప్పారు. సంయుక్త దర్యాప్తు బృందం (జెఐటి) నివేదికలో ఉపయోగించిన భాష దురుద్దేశంతో కూడుకున్నదిగా ఉందని ఆయన అన్నారు. తప్పుడు ఆరోపణల ప్రాతిపదికగా తన రాజీనామా డిమాండ్ చేస్తున్న వ్యక్తులు ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని షరీఫ్ హితవుపలికారు. కుట్రదారులు చేసే ఆరోపణకు స్పందించి తాను రాజీనామా చేసే ప్రసక్తేలేదని పునరుద్ఘాటించారు.