అంతర్జాతీయం

ఉత్తర కొరియాలో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జూలై 13: ఉత్తర కొరియాతీరానికి దూరంగా సముద్రం అడుగున గురువారం రిక్టర్ స్కేలుపై 5.9 పాయింట్ల తీవ్రవతో భూకంపం సంభవించింది. అయితే ఇది అణు పరీక్ష వల్ల సంభవించింది కాదని నిపుణులు అంటున్నారు. ఈ నెల 4న ఉత్తర కొరియా ప్రభుత్వం తన తొలి ఖండాంతర క్షిపణిని పరీక్షించిన విషయం తెలిసిందే. ఉత్తర కొరియా గతంలో జరిపిన అయిదు అణు పరీక్షల్లో కూడా కృత్రిమ భూకంపం లక్షణాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో గురువారం సంభవించిన భూకంపం కూడా అణు పరీక్షవల్లే జరిగి ఉంటుందేమోననే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇది అణు పరీక్ష వల్ల సంభవించింది కాదని, ఎందుకంటే ఉత్తర కొరియా ఇంతకుముందు జరిపిన అణు పరీక్షలన్నీ భూమిపైనే జరిగాయని, ఇప్పుడు ఈ భూకంపం కేంద్రం ఉత్తర కొరియా తీరానికి చాలాదూరంగా సముద్రంలో చాలాలోతులో ఉందని వారంటున్నారు. యుఎస్ జియాలజికల్ సర్వే ప్రకారం ఈ భూకంపం రేవు పట్టణం చోంగ్‌జిన్‌కు ఆగ్నేయంగా 187 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో సంభవించింది. దీని కేంద్రం సముద్రం అడుగున 359 కిలోమీటర్ల లోతులో ఉంది. సాధారణంగా 70 కిలోమీటర్లకన్నా ఎక్కువ లోతులో సంభవించే భూకంపాలు ఉపరితలంపై పెద్దగా ఎలాంటి ప్రభావం చూపించవని దక్షిణ కొరియా ప్రభుత్వ వాతావరణ కేంద్రానికి చో ఇక్ హ్యున్ అన్నారు.