అంతర్జాతీయం

చర్చల ద్వారా పరిష్కరించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, జూలై 14: కాశ్మీర్ సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు భారత్, పాకిస్తాన్‌లు కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస) సూచించింది. ఈ మేరకు ఐరాస చీఫ్ ఆంతోనియో గటెరెస్ పేర్కొన్నట్లు ఆయన ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఈ ప్రాంతంలో పరిస్థితులు చేజారిపోయి ఏదో ఒక ఘోర సంఘటన జరిగేంత వరకు వేచి చూసి అప్పటి వరకు ఐరాస సెక్రటరీ జనరల్ జోక్యం చేసుకోరా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, చర్చల ద్వారా భారత్, పాకిస్తాన్‌లు కాశ్మీర్ సమస్య పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందనే మేము మొదటి నుంచి సూచిస్తున్నామని స్టీఫెన్ అన్నారు. గత జూన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఐరాస చీఫ్ ఇదే విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. అంతే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా ఇరు దేశాధినేతలకు కాశ్మీర్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగానే తాను పాకిస్తాన్ ప్రధానిని మూడుసార్లు, భారత ప్రధానిని రెండు సార్లు అంతర్జాతీయ సమావేశాల్లో కలిశానని స్టీఫెన్ తెలిపారు. ఇందులో భాగంగానే సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదికగా గత జూన్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని భారత ప్రధాని నొక్కి వక్కాణించారని ఆయన చెప్పారు.