అంతర్జాతీయం

బెడిసికొట్టిన ‘డ్రాగన్’ వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రసెల్స్, జూలై 14: డోక్లాం ప్రాంతంలోని డోకలానుంచి జోర్న్‌పెర్లిలోని భూటాన్ సైనిక శిబిరం వైపు రోడ్డు నిర్మాణం విషయంలో దూకుడుగా, ఏకపక్షంగా వ్యవహరించిన చైనా భూటాన్ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్ గట్టిగా రంగంలోకి దిగుతుందని ఊహించలేక పోయిందని ఐరోపా పార్లమెంటు ఉపాధ్యక్షుడు రిజార్డ్ జార్నెస్కీ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు, తమ ఎదుగుదల ప్రపంచ దేశాల శాంతికి ఏ విధంగాను ముప్పుకాదని, నిజానికి శాంతియుత అంతర్జాతీయ వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందంటూ చైనా ప్రపంచ దేశాలకు చెప్పిన అబద్ధాల గుట్టును సైతం యూరోపియన్ పార్లమెంటు కోసం రాసిన ఓ వ్యాసంలో ఆయన బట్టబయలు చేశారు. నిజానికి చైనా మొదటినుంచి కూడా ప్రపంచ దేశాలన్నీ అంగీకరించిన నిబంధనలకు విరుద్ధంగా ఉండే విదేశాంగ విధానానే్న అనుసరిస్తూ వస్తోందని ఆయన అన్నారు.
ప్రధానంగా డోక్లాంలోని ట్రై జంక్షన్ ప్రాంతంలో చైనా, భారత్, భూటాన్ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ- మిలిటరీ ఉద్రిక్తత ఈ విధానానికి ఒక చక్కటి ఉదాహరణ అని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ‘డోక్లాం ప్రాంతంలోని డోకలానుంచి జోర్న్‌పెల్రిలోని భూటాన్ ఆర్మీ క్యాంప్ దిశగా సైనిక వాహనాలు తిరగడానికి అనువుగా ఉండే రోడ్డును నిర్మించాలని జూన్ 16న చైనా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది... వివాదాస్పద డోక్లాం ప్రాంతంలో చైనా చేపట్టిన నిర్మాణ కార్యకలాపాలపై భూటాన్ దౌత్య మార్గాల ద్వారా అభ్యంతరం చెప్తుందని చైనా ముందే ఊహించింది. అయితే భూటాన్ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడానికి భారత్ రంగంలోకి దిగుతుందనే విషయాన్ని అది ఊహించలేదు. డోక్లాం ప్రాంతంలో చైనా చర్య వివాదాస్పద ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను ఏకపక్షంగా మార్చి వేసే ఇటీవలి దాని ధోరణిలో భాగంగానే చూడవచ్చు’ అని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు.
దక్షిణ చైనా సముద్ర జలాలపై హక్కులకు సంబంధించి ఈ ప్రాంతంలోని మలేసియా, వియత్నాం, బ్రూనీ, ఫిలిప్పీన్స్ దేశాల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలో తన వ్యూహాత్మక పట్టును విస్తరించుకోవడం దీనికి ఓ చక్కటి ఉదాహరణ అని ఆయన అన్నారు. డోక్లాం విషక్షంలో భూటాన్ సైనికంగా ప్రతిస్పందించలేదని, రోడ్డు నిర్మాణం కొద్ది వారాల్లోనే పూర్తవుతుందని, దీంతో వ్యూహాత్మకంగా తమదే పైచేయి అవుతుందని చైనా భావించి ఉండవచ్చని, అయితే అంతా అది అనుకున్నట్లుగా జరగలేదని ఆయన అభిప్రాయ పడ్డారు. యథాతథ స్థితిని కొనసాగించాలన్న ప్రదాన లక్ష్యంతో భారత సైన్యాలు రంగం ప్రవేశం చేస్తాయని చైనా ఎంతమాత్రం ఊహించి ఉండదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ విషయంలో భారత్‌ను దోషిగా నిలబెట్టడానికి చైనా ప్రభుత్వం, దాని అధికార ప్రచార యంత్రాంగం ఎంతగానో ప్రయత్నించాయని ఆయన ఆ వ్యాసంలో అభిప్రాయ పడ్డారు. ఆ ప్రాంతంనుంచి భారత సైన్యాలు వెనక్కి వెళ్లేంతవరకు ఈ విషయంపై ఎలాంటి చర్చలు జరపబోమని ఇప్పుడు చైనా పట్టుబడుతోందని కూడా ఆయన అన్నారు.
అయితే కనీ వినీ ఎరుగని రీతిలో ఆర్థికంగా, సైనికంగా ఎదగడంతో పాటుగా అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ ముందుకు సాగాలనే విషయాన్ని చైనా ఇప్పటికయినా అర్థం చేసుకోవాలని, అది లేని పక్షంలో చైనా నాయకులు చెప్పే మాటలను నమ్మడం చాలా కష్టమని అంటూ జార్నెస్కీ తన వ్యాసాన్ని ముగించారు.