అంతర్జాతీయం

యు ఆర్ బ్యూటిఫుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 14: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా, ఏం మాట్లాడినా అది సంచలనమే. ఈ మధ్య ఓ టీవీ యాంకర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేయడమే కాక చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ట్రంప్ వార్తల్లోకి ఎక్కారు.. అది కూడా ఓ దేశ ప్రథమ పౌరురాలిపై వ్యాఖ్యలతో. విషయం ఏమిటంటే..
ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి ఫ్రాన్స్‌లో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. పారిస్‌కు చేరుకున్న ట్రంప్ దంపతులకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఘనంగా స్వాగతం పలికారుకూడా. అనంతరం ట్రంప్ దంపతులు, మేక్రాన్, ఆయన భార్య బ్రిగెట్టీ కలిసి లెస్ ఇన్‌వాలిడెస్‌లోని మ్యూజియంలను సందర్శించడానికి వెళ్లారు. అక్కడ ట్రంప్, మేక్రాన్‌లు, వారి సతీమణులు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. అక్కడినుంచి బయలుదేరి వెళ్లే ముందు ట్రంప్ బ్రిగెట్టీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘మీరు చాలా అందంగా ఉన్నారు. బాగుంటారు.. బ్యూటిఫుల్’ అంటూ పొగడడం ప్రారంభించారు. ఫ్రెంచ్ ప్రభుత్వ అధికార ఫేస్‌బుక్ పేజిలో ఉంచిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. మేక్రాన్ భార్య బ్రిగెట్టీ గతంలో ఆయన హైస్కూల్లో చదివేటప్పుడు టీచర్‌గా ఉన్నారు. వారిద్దరి మధ్య వయసు తేడా కూడా ఎక్కువే. ఆ మాటకొస్తే ట్రంప్‌కు ఆయన సతీమణి మెలానియాకు మధ్య వయసు తేడా తక్కువేమీ కాదనే విషయం తెలిసిందే.

చిత్రం.. లెస్ ఇన్‌వాలిడెస్‌లలోని మ్యూజియంల సందర్శన సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వారి సతీమణులు మాట్లాడుకొంటున్న దృశ్యం