అంతర్జాతీయం

ఘనంగా ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూలై 14: తమ రెండు దేశాల ప్రగాఢ సంబంధాలకు గుర్తుగా శుక్రవారం ఫ్రాన్స్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన మిలిటరీ పెరేడ్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి పాల్గొన్నారు. చాంప్-ఎలిసీస్‌లో అట్టహాసంగా జరిగిన ఈ మిలటరీ పెరేడ్‌కు ఇరువురు నేతలు తమ సతీమణులతో కలిసి విచ్చేశారు. 1917లో మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా పాల్గొని నేటికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా పారిస్‌లో జరిగిన ఈ వేడుకలకు ట్రంప్‌ను మేక్రాన్ తన అతిథిగా ఆహ్వానించారు. 63 విమానాలు, 29 హెలికాప్టర్లు, 241 గుర్రాలు, 3,720 మంది సైనికులు ఈ పెరేడ్‌లో పాలుపంచుకొన్నారు. కాగా, ఏడాది క్రితం నైస్ పట్టణంలో ఈ వేడుకల్లో బాగంగా జరుగుతున్న బాణాసంచా ప్రదర్శనలను తిలకిస్తున్న జనంపైకి ఒక ఇస్లామిక్ ఉగ్రవాది ట్రక్కును నడిపించడంతో 86 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 450 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఈ ఏడాది వేడుకల్లో బాణాసంచాకు బదులుగా కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళి అర్పించారు.
చుట్టూ డజన్ల సంఖ్యలో రిపబ్లికన్ గార్డులు గుర్రాలపై కదులుతూ ఉండగా, ఒక జీపుపై నిలబడిన మేక్రాన్ దారి పొడవునా బారులు తీరి నిలుచున్న జనానికి అభివాదం చేస్తూ పెరేడ్ వద్దకు చేరుకున్నారు. ఇవి అద్భుతమైన జాతీయ వేడుకలని గురువారం మేక్రాన్‌తో కలిసి సంయుక్తంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ట్రంప్ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ట్రంప్‌కు మేక్రాన్ ఎర్ర తివాచీతో ఘనంగా స్వాగతం పలికారు. కాగా, గత ఏడాది ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది వేడుకల్లో పాల్గొనడానికి వచ్చే జనం రక్షణ కోసం లక్షా 30 వేలకు పైగా భద్రత, ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బందిని నియమించారు.

చిత్రాలు.. . ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా జరిగిన వైమానిక విన్యాసాలను తిలకిస్తున్న అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు ట్రంప్, మేక్రాన్