అంతర్జాతీయం

ఉగ్రవాదులకు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 15: ఓ వైపు భారత్‌తో రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటూనే మరోవైపు పాకిస్తాన్‌కు చేసే రక్షణ సాయం విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌కు సంబంధించిన జాతీయ భద్రతా అధీకృత చట్టం (ఎన్‌డిఏఏ) 2018కు తీసుకు వచ్చిన సవరణలను శుక్రవారం అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది.
అమెరికానుంచి పాకిస్తాన్‌కు వచ్చే రక్షణ సాయంపై మరింత కఠినమైన నిబంధనలు వర్తించేలా ఈ చట్టానికి మూడు సవరణలను అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ఉగ్రవాదంపై పాక్ ప్రభుత్వం జరుపుతున్న పోరు సంతృప్తికరంగా ఉంటేనే నిధులను మంజూరు చేసే విధంగా చేయాలని ఆ చట్ట సవరణల్లో పేర్కొన్నారు. జాతీయ భద్రతా అధీకృత చట్టానికి తీసుకువచ్చిన ఈ మూడు సవరణలను అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ సవరణల్లో రెండిటిని కాంగ్రెస్ సభ్యుడు డానా రోహ్రాబాచర్ ప్రతిపాదించగా, మరో సవరణను విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఉగ్రవాదం, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం, వ్యాపారంపై ఉపసంఘం చైర్మన్ కూడా అయిన టెడ్ పో ప్రతిపాదించారు. ‘అమెరికాకు పాకిస్తాన్ నమ్మక ద్రోహానికి ముగింపు పలకడంలో ఈ రోజు అమెరికా కాంగ్రెస్ ఓ అడుగు ముందుకు వేసింది’ అని పో వ్యాఖ్యానించారు. గతంలో కూడా పో పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని పలుసార్లు ఒబామా ప్రభుత్వాన్ని కోరారు. కొత్త నిబంధనల ప్రకారం ఉత్తర వజిరిస్థాన్‌ను స్థావరంగా చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలు
నిర్వహిస్తున్న హక్కానీ నెట్‌వర్క్‌ను అదుపు చేయడానికి అవసరమైన కృతనిశ్చయాన్ని పాకిస్తాన్ ప్రదర్శిస్తోందని అమెరికా రక్షణ శాఖ మంత్రి సర్టిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే పాక్-అఫ్గాన్ సరిహద్దుల వెంబడి హక్కానీ నెట్‌వర్క్‌లతో పాటుగా ఉగ్రవాదుల కదలికలను అదుపు చేయడానికి పాక్ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కూడా రక్షణ మంత్రి సంతృప్తి చెందాల్సి ఉంటుంది. పాకిస్తాన్‌లో లేదా అఫ్గానిస్థాన్‌లో అమెరికా ఉగ్రవాదిగా గుర్తించిన ఏ వ్యక్తికి కూడా సైనికంగా, ఆర్థికంగా, లేదా ఇతర ఏ మార్గాల్లోను తోడ్పాటు అందించడం లేదని రక్షణ శాఖ మంత్రి సంతృప్తి చెందితే తప్ప పాక్‌కు అమెరికా నిధులను విడుదల చేయదు. 2017 అక్టోబర్ 1నుంచి 2008 డిసెంబర్ 31 మధ్య కాలంలో అమెరికా పాక్‌కు రక్షణ సాయం కింద 400 మిలియన్ డాలర్ల సాయం అందించనుంది.
అలాగే అమెరికా-్భరత్ మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉద్దేశించిన సవరణకు కూడా ఈ సభ ఆమోదం తెలిపింది. రక్షణ రంగంలో అమెరికాకు భారత్ ఇప్పటికే అతిపెద్ద భాగస్వామ్య దేశంగా ఉన్న విషయం తెలిసిందే. భారత్‌తో సైనిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఉద్దేశించిన సవరణను ఇండో-అమెరికా పార్లమెంట్ సభ్యుడు అమీ బెరా ప్రతిపాదించగా,ప్రతినిధుల సభ దీనిని మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 621.5 కోట్ల డాలర్ల రక్షణ బడ్జెట్‌కు సంబంధించిన ఎన్‌డిఎఎ-2018కు ప్రతినిధుల సభలో 344 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 81 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. భారత్‌కు సంబంధించి ప్రతినిధుల సభ ఆమోదించిన సవరణ విషయమై అమెరికా రక్షణ మంత్రి తగిన కసరత్తు చేస్తారు.