అంతర్జాతీయం

జాధవ్ తల్లికి వీసా ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూలై 15: కుల్‌భూషణ్ జాధవ్ తల్లి పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి ఆమెకు వీసాను మంజూరు చేయాలని, ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇది చక్కటి అవకాశంగా ఉపయోగపడుతుందని పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక శనివారం ఉద్ఘాటించింది. కుల్‌భూషణ్ జాధవ్‌కు భారత దౌత్య కార్యాలయం సహాయాన్ని అందించేందుకు పాక్ ప్రభుత్వం నిరాకరించడంతో పాటు కుల్‌భూషణ్ జాధవన్‌ను చూసేందుకు వీసా మంజూరు చేయాలని కోరుతూ ఆయన తల్లి చేసుకున్న దరఖాస్తును పెండింగ్‌లో పెట్టిందని తెలియడంతో ‘డాన్’ పత్రిక పైవిషయాన్ని స్పష్టం చేసింది. కుల్‌భూషణ్ జాధవ్ తల్లికి వీసా మంజూరు చేయడంద్వారా మానవత్వం ఎప్పటికీ వర్థిల్లుతుందని పాక్ ప్రభుత్వం చాటి చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతలతో పరస్పరం కత్తులు దూసుకుంటున్న భారత్, పాకిస్తాన్ మధ్య వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచేందుకు ఇది తాజా అవకాశంగా ఉపయోగపడుతుందని ‘డాన్’ పత్రిక తమ సంపాదకీయంలో పేర్కొంది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు చిన్నచిన్న చర్యలు సైతం మార్గాన్ని చూపి ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేందుకు ద్వారాలు తెరవగలవని స్పష్టం చేసింది.