అంతర్జాతీయం

నవాజ్ షరీఫ్‌పై కేసులు మళ్లీ తిరగదోడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 16: లండన్‌లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులపై దర్యాప్తు జరుపుతున్న సంయుక్త దర్యాప్తు బృందం ఆయనపై 15 కేసులను తిరగదోడాలని సిఫారసు చేసినట్లు ఆదివారం ఒక వార్తా కథనం వెల్లడించింది. పనామా పత్రాల లీకేజీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన అనంతరం పాక్ సంయుక్త దర్యాప్తు బృందం ఈ అంశంపై దృష్టి సారించిన విషయం విదితమే. 1990వ దశకంలో నవాజ్ షరీఫ్ రెండుసార్లు పాక్ ప్రధానిగా ఉన్నప్పుడు లండన్‌లో తన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులను కొనుగోలు చేసేందుకు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నవాజ్ షరీఫ్ తన పిల్లల ఆధ్వర్యంలో నడుస్తున్న విదేశీ కంపెనీలద్వారా నిధులు మళ్లించి ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు గత ఏడాది లీకైన పనామా పత్రాలు వెల్లడించాయి. దీంతో ఈ అంశంపై దర్యాప్తు జరిపిన ఆరుగురు సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం ఈ నెల 10వ తేదీన తన నివేదికను పాక్ సుప్రీం కోర్టుకు సమర్పించింది. నవాజ్ షరీఫ్, ఆయన పిల్లలు తమ ఆదాయ వనరులకు మించి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, కనుక వారిపై కొత్త అవినీతి కేసు నమోదు చేయాలని సంయుక్త దర్యాప్తు బృందం తమ నివేదికలో సిఫారసు చేసింది.