అంతర్జాతీయం

మునిగిన బోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యవాండే, జూలై 17: కామెరూన్ నైరుతి తీరంలో ఆదివారం సైనిక బోటు నీట మునగడంతో అందులో ప్రయాణిస్తున్న 34 మంది సైనికులు గల్లంతయ్యారు. సిబ్బంది సహా మొత్తం 37 మందిని తీసుకెళ్తున్న ఈ బోటు ఇంధనాన్ని నింపుకునేందుకు ఆదివారం ఉదయం బకాస్సీ నగరానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని రక్షణ శాఖ మంత్రి జోసఫ్ బెటి అసోమో ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారని, మిగిలిన 34 మంది ఆచూకీ ఇప్పటివరకూ లభ్యం కాలేదని ఆయన తెలిపారు. ఈ ప్రమాదానికి దారి తీసిన కారణాలేమిటన్నదానిపై స్పష్టత రాలేదని, అయితే ఆ సమయంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు.