అంతర్జాతీయం

రెచ్చిపోతున్న చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 17: టిబెట్‌లో చైనా తమ అత్యాధునిక ఆయుధాలతో (లైవ్-ఫైర్ డ్రిల్) ప్రదర్శనను నిర్వహించింది. 11గంటల పాటు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ) టిబెట్ అటానమస్ ప్రాంతంలో లైవ్-ఫైర్ డ్రిల్‌ను నిర్వహించినట్లు చైనా అధికారిక న్యూస్ చానల్ చైనాసెంట్రల్ టెలివిజన్ (సిసిటివి) పేర్కొంది. అయితే ఎప్పుడు, ఎన్ని గంటలకు నిర్వహించిందో మాత్రం వెల్లడించలేదు. పర్వత పీఠభూమి బ్రిగేడ్‌కు చెందిన టిబెట్ మిలిటరీ కమాండ్ ఈ లైవ్-ఫైర్ డ్రిల్‌ను నిర్వహించింది.
భారత-చైనా సరిహద్దు గస్తీలో టిబెట్ మిలిటరీ కమాండ్ ప్రధాన భూమిక నిర్వహిస్తుంది. సిసిటివి విడుదల చేసిన వీడియో ప్రకారం, శత్రువులపై వివిధ కమాండ్‌లకు సంబంధించిన సైన్యం విభాగాలు కలిసికట్టుగా ఒకేసారి మెరుపు దాడిచేసేందుకు కావాల్సిన సన్నద్ధను ఈ డ్రిల్‌లో ప్రదర్శించారు. యాంటి టాంక్ గ్రెనేడ్స్, బంకర్స్ విధ్వంసానికి ఉపయోగించే మిసైళ్లను ఈ డ్రిల్‌లో ఉపయోగించినట్టు సిసిటివి ఆన్‌లైన్‌లో ఓ వీడియోను కూడా విడుదల చేసింది. అంతేకాకుండా రాడార్లు ఉపయోగించి విమాన విధ్వంసాన్ని, లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను ఉపయోగించడంలో మెలకువలను కూడా ప్రదర్శించింది. అత్యవసర సమయంలో సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా తాత్కాలిక మొబైల్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడం తదితర యుద్ధ సంబంధ ప్రదర్శనలను చైనా సైన్యం నిర్వహించినట్లు సిసిటివి విడుదల చేసిన వీడియోలో ఉన్నాయి. దీంతోపాటు చైనా కొత్తగా తయారు చేసిన ఆయుధాలను, తక్కువ బరువున్న అత్యాధునిక యుద్ధ ట్యాంకులను కూడా టిబెట్‌లో నిర్వహించిన లైవ్-ఫైర్ డ్రిల్‌లో ఉపయోగించింది. భారత్, చైనాకు మధ్య సిక్కిం సరిహద్దులోని డోక్లామ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా లైవ్-ఫైర్ డ్రిల్ నిర్వహించడం ప్రాముఖ్యత సంతరించుకుంది.