అంతర్జాతీయం

నవాజ్ షరీఫ్‌పై మళ్లీ విచారణ ప్రారంభించిన పాక్ సుప్రీం కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 17: పనామా పత్రాల కుంభకోణంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి బాగోతంపై ఆ దేశ సుప్రీం కోర్టు సోమవారం మళ్లీ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంలో నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కుమారులపై అవినీతి కేసు నమోదు చేయాలని సంయుక్త దర్యాప్తు బృందం (జెఐటి) సిఫారసు చేసిన వారం రోజుల తర్వాత సుప్రీం కోర్టు ఈ విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నివారించేందుకు పాక్ సుప్రీం కోర్టు వద్ద దాదాపు 700 మంది పోలీసులు, సైనిక రేంజర్లతో పాటు స్థానిక అధికారులను మోహరించారు. 1990వ దశకంలో నవాజ్ షరీఫ్ ప్రధాన మంత్రిగా పనిచేసినప్పుడు కుటుంబ సభ్యుల పేరిట లండన్‌లో ఆస్తులను కొనుగోలు చేసేందుకు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై పాకిస్తాన్ సర్వోన్నత న్యాయస్థానం ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన సంయుక్త దర్యాప్తు బృందం తమ 60 రోజుల దర్యాప్తు నివేదికను ఈ నెల 10వ తేదీన తమ తుది నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. అయితే ఇది ‘చెత్త’ నివేదిక అని, నవాజ్ ప్రభుత్వం న్యాయస్థానంలో సవాలు చేస్తుందని రక్షణ శాఖ మంత్రి క్వాజా ఆసిఫ్ చెప్పారు.

చిత్రం.. నవాజ్ షరీఫ్ కుమార్తె మిరియమ్ నవాజ్ కూడా జెఐటి నివేదికను తోసిపుచ్చారు.