అంతర్జాతీయం

బ్రిటన్ అధికార పార్టీలో లుకలుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 18: బ్రిటన్ అధికార పార్టీలో సమస్యలు ముసురుకుంటున్నాయి. కన్జర్వేటివ్ సభ్యులకు ప్రధాని థెరిసా మేకు మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. అక్టోబరులో జరిగే వార్షిక సమావేశం తరువాత నాయకత్వ మార్పుపై కన్జర్వేటివ్ సభ్యులు పావులు కదిపేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పార్టీ సభ్యులు వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ వద్దంటూ కేబినెట్ సమావేశంలో ప్రధాని థెరిసా మే హెచ్చరించారు. ఇలా చేస్తే పార్టీ సంక్షోభంలో పడిపోవడమే కాకుండా ప్రతిపక్ష నేత లేబర్ పార్టీ అధ్యక్షుడు జెర్మీ కార్బిన్‌కు అధికార పగ్గాలు అప్పజెప్పిన వారమవుతామని థెరిసా పార్టీ సభ్యులను హెచ్చరించారు. ఇప్పుడే తేల్చుకోండి నేనా, కార్బినా.. ఎవరిని దేశ ప్రధానిగా చూడాలనుకుంటున్నారని థెరిసా మే పేర్కొన్నారు. దేశ ప్రజలెవరూ కార్బిన్‌ను దేశ ప్రధానిగా చూడాలనుకోవడం లేదని ఆమె చెప్పారు. యుకె చాన్సలర్ ఫిలిప్ హామండ్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌కు లీకులు చేయడం, ప్రచారం చేయడం మానుకోవాలని పార్టీ సభ్యులను ఆమె హెచ్చరించారు.