అంతర్జాతీయం

దౌత్యవేత్తలు షాకవుతున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 18: రాజకీయ లక్ష్యాల సాధనకు డోక్లామ్ వివాదాన్ని విధానపరమైన అంశంగా వాడుకుంటే సహించేది లేదంటూ భారత్‌ను చైనా హెచ్చరించింది. సరిహద్దుల్లో తీవ్ర పరిణామాలు తలెత్తకముందే, భారత బలగాలను ఉపసంహరించాలని హెచ్చరించింది. ఇదే సమయంలో డోక్లామ్ విషయంలో చైనా-్భరత్‌ల మధ్య తలెత్తిన ప్రతిష్టంభన వివరాలు తెలుసుకోవడానికి విదేశీ దౌత్యవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారంటూ చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ‘సరిహద్దుల్లో భారత దళాలు మోహరించటం పట్ల విదేశీ దౌత్యవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమేనా? అంటూ ఆతృత కనబరుస్తున్నారు’ అని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి లు కాంగ్ మంగళవారం స్పష్టం చేశారు. అయితే, డోక్లామ్ వ్యవహారాన్ని వివరించడానికే విదేశీ దౌత్యవేత్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారా? అన్నది చైనా వెల్లడించలేదు. ‘విదేశీ దౌత్యవేత్తల ఆసక్తిమేరకు ఈ అంశంపై చైనా పూర్తి సమాచారం అందించింది’ అని మీడియాకు కాంగ్ వెల్లడించారు. గత వారం దౌత్యవేత్తలతో సమావేశం నిర్వహించిన చైనా, భూటాన్ ట్రైజంక్షన్ వద్ద భారత్‌తో ఏర్పడిన ప్రతిష్టంభనను వివరించినట్టు తెలుస్తోంది. ట్రైజంక్షన్ వద్ద చైనా నిర్మిస్తోన్న వివాదాస్పద రహదారి కారణంగా ఇరువైపులా సరిహద్దుల్లో నెలరోజులుగా సైనిక బలగాలు మోహరించిన విషయం తెలిసిందే. ట్రైజంక్షన్ వద్ద చైనా నిర్మిస్తోన్న వివాదాస్పద రహదారి కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించే మార్గాలను చైనా సైన్యం అడ్డుకునే ప్రమాదం ఉందని భారత్ వాదిస్తోంది. రహదారి నిర్మాణంతో భారత భద్రతకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉందనీ ఇప్పటికే చైనాకు విస్పష్టంగా చెప్పింది. అయితే భారత వాదనను కొట్టిపారేస్తున్న చైనా ‘మా సహనాన్ని పరీక్షించకండి. సరిహద్దుల్లో వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయి. సిక్కిం సెక్టార్‌కు సంబంధించి ఇరు దేశాల మధ్య స్పష్టమైన అంగీకారం ఉంది. కానీ, భారత్ మాత్రం ఒప్పందాలు ఉల్లంఘించి చైనా ప్రాథికార ప్రాంతంలోకి అడుగుపెట్టింది’ అని బీజింగ్ వాదిస్తోంది. భారత్ అనైతిక దాటుడుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని చైనా సునిశిత దృష్టితో పరిశీలిస్తోంది లు మీడియాకు వెల్లడించారు. ‘తలెత్తిన ప్రతిష్టంభకు ఫుల్‌స్టాప్ పెట్టడం అన్నది భారత్ సమయోచిత ఆలోచనపైనే ఆధారపడి ఉంది. తప్పు గ్రహించి వెనక్కి మళ్లడమే కాదు, సరిహద్దుల నుంచి సైనిక బలగాలను ఉపసంహరించాలి’ అని లు వ్యాఖ్యానించారు. ‘్భరత బలగాలతో తలపడే పరిస్థితి రాకుండా చైనా జాగ్రత్తలు తీసుకుంటోంది. సార్వభౌమాధికారాన్ని నిలుపుకోడానికి అవసరమైతే యుద్ధానికైనా చైనా సిద్ధమే’నంటూ గ్లోబల్ టైమ్స్ పత్రికలో కథనాలు వస్తుండటం గమనార్హం.