అంతర్జాతీయం

పాక్‌కు సాయంపై అమెరికా కఠిన ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 20: పాకిస్తాన్‌కు అందించే సహాయానికి సంబంధించి కఠినమైన షరతులు అమలుచేయాలని అమెరికా కాంగ్రెస్ ప్యానెల్ స్పష్టం చేసింది. ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా పటిష్టమైన చర్యలను తీసుకోవడంలో పాకిస్తాన్ విఫలమైతే ఆర్థిక సహాయాన్ని నిలిపివేసే అధికారాన్ని విదేశాంగ మంత్రికి అప్పగించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని సభ వినిమయ కమిటీ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
విదేశీ ఆపరేషన్లకు సంబంధించిన ఈ బిల్లును కమిటీ ఆమోదించడంతో తదుపరి ప్రతినిధుల సభ పరిశీలనకు నివేదిస్తారు. ఈ బిల్లు ప్రకారం పాకిస్తాన్ అనేక షరతులకు లోబ డే అమెరికా సహాయాన్ని పొందుతుంది. అంతేగాదు, ఉగ్రవాద నిరోధక చర్యలపై అమెరికాకు అది అందించే సహకారం కూడా ఈ సహాయ పరిమాణాన్ని నిర్దేశిస్తుంది. ముఖ్యంగా హక్కానీ నెట్‌వర్క్, ష్యూరా తాలిబన్, లష్కరే తోయి బా, జైషే మహ్మద్, అల్‌ఖైదా తదితర ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సహాయంతో ముడిపెట్టడం ప్రాధాన్యతను సంరించుకుంది. ఈ సాయం పాక్‌కు అందాలంటే ఉగ్రవాద నిరోధక చర్యలను సరైన రీతిలోనే చేపడుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ విషయం లో ఏమాత్రం పాక్ విఫలమైనా అందిస్తున్న సహాయాన్ని నిలిపివేసే పూర్తి అధికారం ఆయనకే ఉంటుంది.