అంతర్జాతీయం

వైట్ హౌస్ సమాచార విభాగం డైరెక్టర్‌గా స్కారమస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సమాచార విభాగ కొత్త డైరెక్టర్‌గా స్కారమస్సీ (53)ని నియమించారు. మృదు భాషిగా, వాల్‌స్ట్రీట్ ఫైనాన్షియర్‌గా ఎంతో పేరుపొందిన స్కారమస్సీ దీర్ఘకాలం నుంచి ట్రంప్‌కు అనుంగు మద్దతుదారుడిగా కొనసాగుతున్నాడు. కుంభకోణాలతో సమతమవుతున్న ట్రంప్ అధికార గణంలో అందరికీ చిరపరిచితుడైన సీన్ స్పైసర్ అమెరికా అధ్యక్ష భవన (వైట్ హౌస్) సమాచార విభాగ కార్యదర్శి పదవి నుంచి వైదొలగడంతో స్కారమస్సీని ఈ పదవిలో నియమించాల్సి వచ్చింది. గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ ప్రచారకర్తలు (క్యాంపెయిన్ మేనేజర్లు) రష్యాతో కుమ్మక్కయారన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో స్కారమస్సీని ఈ పదవిలో నియమించారు. ప్రస్తుతం ఆయన ఎగ్జిమ్ (ఎగుమతులు-దిగుమతుల) బ్యాంకులో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా, వైస్-ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న స్కారమస్సీ ఆగస్టు 15వ తేదీన అధికారికంగా కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు. మెసేజ్ డెవలప్‌మెంట్, స్ట్రాటజీసహా వైట్‌హౌస్ సమాచార విభాగ కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించనున్న స్కారమస్సీ ఏ విషయాన్నైనా నేరుగా ట్రంప్‌కే రిపోర్టు చేయాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో వెల్లడించింది. స్పైసర్ హయాంలో వైట్ హౌస్ సమాచార విభాగం అనేక వివాదాలతో అప్రతిష్ఠపాలైన విషయం తెలిసిందే.
సీన్ స్పైసర్ రాజీనామా
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ తన పదవికి రాజీనామా చేశారు. అతి తక్కువ కాలమే పదవిలో కొనసాగినప్పటికీ తన దూకుడు కారణంగా స్పైసర్ వివాదాస్పదుడుగా మారారు. జర్నలిస్టుల పట్ల ఆయన ప్రవర్తనపై ఇటీవలే ఓ ప్రముఖ న్యూస్ చానల్‌లో వ్యంగ్యంగా ఓ టీవీ షో కూడా ప్రసారమైంది. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులు కొనసాగుతున్న తరుణంలో స్పైసర్ రాజీనామా చేయడం ట్రంప్ ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమేనని చెప్పవచ్చు. గత మేలో మైక్ డుబ్కే రాజీనామా చేసినప్పటినుంచి స్పైసర్ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవితోపాటుగా కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా కూడా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

చిత్రం.. స్కారమస్సీ