అంతర్జాతీయం

3,900 వెబ్‌సైట్లను మూసివేసిన చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 23: చైనాలోని ఇంటర్నెట్ నిఘా సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 3,918 అక్రమ వెబ్‌సైట్లను మూసివేయించాయి. చైనా అధికార వార్తా సంస్థ ‘జిన్హువా’ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిలో దేశ భద్రతకు ముప్పు కలిగించే సమాచారాన్ని ప్రచురించే వెబ్‌సైట్లతోపాటు హింసను, అశ్లీలాన్ని, వదంతులను వ్యాప్తి చేస్తున్న వెబ్‌సైట్లు ఉన్నాయని సిఎసి (సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా) శనివారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో అక్రమ వెబ్‌సైట్లకు సంబంధించిన 316 కేసులను న్యాయ సంస్థలకు అప్పగించడంతోపాటు 8.10 లక్షలకు పైగా అక్రమ సైబర్ అకౌంట్లను మూసివేసినట్లు ‘జిన్హువా’ తెలిపింది.