అంతర్జాతీయం

పాక్ రక్తసిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూలై 24: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో సిఎం కార్యాలయానికి కూతవేటు దూరంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో కనీసం 26మంది మరణించారు. పంజాబ్ ప్రావిన్స్ సిఎం షాహ్‌బాజ్ షరీఫ్ నివాసానికి కొద్దిదూరంలో సోమవారం ఉదయం టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పోలీసులను లక్ష్యం చేసుకుని దాడి జరిగిందని లాహోర్ పోలీస్ చీఫ్ కెప్టెన్ అమిన్ వైన్స్ తెలిపారు. ఆర్ఫా కరీమ్ టవర్ వద్ద లాహోర్ అభివృద్ధి అథారిటీ అధికారులు, పోలీసులు కలిసి ఆక్రమణలను తొలగిస్తుండగా పెద్దశబ్దంతో పేలుడు సంభవించిందని ఆయన వివరించారు. సిఎం మోడల్ టౌన్ నివాసం దగ్గరే కరీం టవర్ ఉంది. గాయపడిన 57 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అన్ని సిటీ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. షాహ్‌బాజ్ షరీఫ్ ప్రధాని నవాజ్‌షరీఫ్ సోదరుడు. పేలుడు జరిగిన సమయంలో ఆయన అధికారులతో సమావేశంలో ఉన్నారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారిలో పలువురు పోలీసులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఘటనపై పంజాబ్ సిఎం షాహబాజ్ తీవ్రంగా స్పందించారు. దీన్ని ఖండించటానికి మాటలు రావటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పంజాబ్ న్యాయశాఖ మంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదులది పిరికిపందల చర్య అన్నారు. అమరుల త్యాగాలు వృథా పోవని, దీనిపై కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు.

చిత్రాలు.. పంజాబ్ ప్రావిన్స్‌లో ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతం. (ఇన్‌సెట్‌లో)
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం.