అంతర్జాతీయం

గెలాక్సీల నుంచే మనిషి ఆవిర్భావం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 27: అంతరిక్షంలోని సుదూర గెలాక్సీల నుంచి కొట్టుకువచ్చిన పదార్థాల నుంచే మనిషి ఆవిర్భవించాడా? అయి ఉండవచ్చని శాస్తజ్ఞ్రులు అంటున్నారు. గెలాక్సీల నుంచి విపరీతమైన వేగవంతో వీచిన గాలులకు కొట్టుకు వచ్చిన పదార్థాలతోనే పాలపుంత (మిల్కీ వే) ఏర్పడింది. అయితే గెలాక్సీలు, పాలపుంత ఏర్పడడానికి కావాల్సిన పదార్థం ఏ విధంగా వచ్చి చేరి ఉంటుందన్న దానిపై అమెరికా నార్‌వెస్ట్రెన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సూపర్ కంప్యూటర్‌ను ఉపయోగించి చేసిన పరిశోధనల్లో కొన్ని అనుకరణల ద్వారా కొత్త విషయాలను కనుగొన్నామని విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్త డానియల్ ఏంజ్లిస్ అల్‌కజార్ తెలిపారు. ఇతర గెలాక్సీల నుంచి వచ్చిన పదార్థాలు ఎంతవరకు మనిషి ఆవిర్భానికి తోడ్పడ్డాయన్న విషయం తెలుసుకుంటే మానవుడు అంతరిక్ష యాత్రికుడా లేదా గెలాక్సీయేతర వలసదారుడా? అన్న విషయం తెలుస్తుందని పేర్కొన్నాడు. వేరే గెలాక్సీలలో ఉన్న పదార్థాలే పాలపుంతలో ఉన్నాయని, అవన్నీ వేరువేరు గెలాక్సీల నుంచి కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో వీచే గాలులకు కొట్టుకువచ్చి చేరాయని చెప్పారు.