అంతర్జాతీయం

షరీఫ్‌పై అనర్హత వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 28: పనామా గేట్ కేసులో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు శుక్రవారం ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నవాజ్ షరీఫ్ ప్రధాని పదవిలో కొనసాగడానికి అనర్హుడిగా ప్రకటించిన న్యాయస్థానం, పనామా గేట్ కుంభకోణంలో విచారణ కోసం ఆయన కేసును అవినీతి వ్యతిరేక కోర్టుకు పంపించాలని కూడా ఆదేశించింది. అంతేకాదు షరీఫ్‌పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఆయనపైన, ఆయన కుటుంబంపైన ఫిర్యాదును పూచీకత్తు కోర్టుకు నివేదించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక ఆరు వారాల్లోగా విచారణను పూర్తి చేయాలని కూడా జాతీయ పూచీకత్తు బ్యూరోను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ‘పార్లమెంటులో నిజాయితీ కలిగిన సభ్యుడిగా కొనసాగే అర్హత షరీఫ్‌కు ఎంతమాత్రం లేదు. ఆయన ప్రధానిగా కొనసాగడానికి వీల్లేదు’ అని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా ప్రకటించిన తీర్పులో స్పష్టం చేసింది. ఆయనతోపాటుగా పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్‌ను కూడా అనర్హుడిగా ప్రకటిస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో నవాజ్ షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కాగా, నవాజ్ షరీఫ్ స్థానంలో కొత్త ప్రధానిగా ఆయన సోదరుడు, ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న షెహబాజ్ షరీఫ్ ఎన్నిక కావొచ్చని తెలుస్తోది. షెహబాజ్ ప్రస్తుతం జాతీయ అసెంబ్లీలో సభ్యుడు కాదు. అందువల్ల ఆయన ఉప ఎన్నికలో పోటీ చేసి జాతీయ అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి కేసును విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శనివారం తీర్పును ప్రకటించింది. న్యాయమూర్తులు ఆసిఫ్ సరుూద్ ఖోసా, ఎజాజ్ అఫ్జల్ ఖాన్, గుల్జార్ అహ్మద్, షేక్ అజ్మత్ సరుూద్, ఇజాజుల్ అహ్సన్‌లు ధర్మాసనంలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఒకటో నెంబరు గదిలో క్రిక్కిరిసిన జనం మధ్య జస్టిస్ ఎజాజ్ అప్జల్ ఖాన్ తీర్పును ప్రకటించారు.
1990 దశకంలో షరీఫ్ రెండుసార్లు ప్రధానిగా ఉన్న సమయంలో కుటుంబంతో కలిసి లండన్‌లో పెద్దఎత్తున ఆస్తులు కొనుగోలు చేయడం కోసం దేశంనుంచి అక్రమంగా భారీఎత్తున నగదును తరలించారని అభియోగాలున్నాయి. పలు డొల్ల కంపెనీలను అడ్డుపెట్టుకొని లండన్‌లో భారీఎత్తున ఆస్తులు కూడబెట్టారని పనామా పత్రాలు సైతం వెల్లడించాయి. విదేశాల్లోని నవాజ్ షరీఫ్ సంతానానికి చెందిన కంపెనీల ద్వారా వాటిని నిర్వహిస్తున్నట్టు పనామా పత్రాలు గత ఏడాది బైటపెట్టాయి. అయితే ఈ ఆరోపణలను అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ గట్టిగా ఖండించింది. నవాజ్ షరీఫ్ సైతం లండన్‌లోని ఆస్తులు తన తండ్రి వ్యాపారం ద్వారా సంపాదించినవేనని వాదించారు.
అయితే ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా ప్రతిపక్షాలైన పాకిస్తాన్ తెహ్రీక్ ఇ-ఇన్సాఫ్, అవామీ ముస్లింలీగ్, జమాత్-ఇ- ఇస్లామీ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు గత ఏడాది అక్టోబర్‌లో కేసు విచారణ చేపట్టింది. అంతేకాకుండా షరీఫ్, ఆయన కుటుంబీకులపై వచ్చిన ఆరోపణలపైనా లోతుగా దర్యాప్తు జరపడానికి వివిధ దర్యాప్తు ఏజన్సీలతో కూడిన ఆరుగురు సభ్యులతో సంయుక్త దర్యాప్తు బృందం (జెఐటి)ను ఏర్పాటు చేసింది. ఈనెల 10న సుప్రీంకోర్టుకు జిట్ తన నివేదిక అందించింది. షరీఫ్, ఆయన కుటుంబీకుల జీవనశైలి వారి ఆదాయానికి మించిన స్థాయిలో ఉందని పేర్కొన్న జిట్, వారిపై కొత్తగా అవినీతి కేసు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. ఈ నివేదిక ఆధారంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈనెల 21న తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.