అంతర్జాతీయం

ప్చ్.. అసంపూర్ణ ప్రధాని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 28: పాకిస్తాన్ సుప్రీం కోర్టు తీర్పుతో ఉద్వాసనకు గురైన నవాజ్ షరీఫ్, మూడోసారీ అసంపూర్ణ ప్రధానిగా మిగిలిపోయారు. పాక్‌లో రాజకీయ అస్థిరత తలెత్తిన ప్రతిసారీ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రధాని పదవి అందుకుంటూ వచ్చిన షరీఫ్, తరువాతి పరిణామాల్లో ఉద్వాసనల నుంచి తప్పించుకోలేక పోవడం గమనార్హం. ఉక్కు టైకూన్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన షరీఫ్ తొలిసారి 1990లో ప్రధాని పదవి అధిష్టించారు. ఆ సమయంలో పాక్ అధ్యక్షుడు గులామ్ ఇషాక్ ఖాన్‌తో విభేదాలు తలెత్తాయి. ఆ పరిణామాల్లో తన సర్వాధికారాలు వినియోగించి అధ్యక్షుడు గులామ్ పార్లమెంట్‌ను రద్దు చేయడంతో 1993లో షరీఫ్ పదవి కోల్పోయారు. 1997లో మళ్లీ అదృష్టం కలిసొచ్చి ప్రధాని పీఠాన్ని షరీఫ్ అధిష్టించారు. ఆ సమయంలో పర్వేజ్ ముషారఫ్ సారథ్యంలో మిలటరీ తిరుగుబాటుకు దిగడంతో, 1999లో పదవీచ్యుతుడై జైలుకెళ్లాల్సి వచ్చింది. తదుపరి పరిణామాల్లో సౌదీకి వెళ్లిపోయిన షరీఫ్ 2007 వరకూ మళ్లీ పాక్‌లోకి అడుగుపెట్టలేదు. 2013లో పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిపి పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పిఎంఎల్-ఎన్)ను ఏర్పాటు చేసిన షరీఫ్, పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించి మళ్లీ ప్రధాని గద్దెనెక్కారు. తాజాగా పనామా గేట్ కుంభకోణంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మూడోసారి పదవీకాలం పూర్తికాకుండానే ఉద్వాసనకు గురై షరీఫ్ అసంపూర్ణ ప్రధాని అన్న రికార్డు సృష్టించినట్టయింది.
దేశంలోనే శక్తివంతమైన వ్యాపార కుటుంబ నేపథ్యంతో రాజకీయాల్లోకి వచ్చిన షరీఫ్, ఎన్నో సంక్షోభాలు అధిగమించి 2013 జూన్‌లో మూడోసారి ప్రధాని పదవి చేపట్టారు. అయితే పనామా గేట్ కుంభకోణంలో నవాజ్ ఎదుర్కొంటున్న అభియోగాలను సుప్రీం కోర్టు నిర్థారిస్తూ ఆయనను దోషిగా తేల్చటంతో ప్రధాని పదవి నుంచి షరీఫ్ దిగిపోక తప్పలేదు. ఆర్థికంగానూ, ఉగ్రవాదుల నుంచీ సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో, షరీఫ్‌కు ఉద్వాసన పలుకుతూ సుప్రీం ఇచ్చిన తీర్పు పాక్‌కు అశనిపాతమే.