అంతర్జాతీయం

టెర్రరిజం ధోరణి అత్యంత ప్రమాదకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 29: ఉగ్రవాదాన్ని కొన్ని దేశాలు ఓ సాధనంగా వాడుకుంటున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమైన అంశమని భారత్ ప్రపంచానికి హెచ్చరించింది. అంతర్జాతీయంగా తీవ్రమైన ప్రమాదకరంగా ఈ రకమైన ధోరణి పరిణమించనున్నదని, ఇలాంటి దేశాల పట్ల ఉపేక్ష ఏ విధంగానూ పనికిరాదని కౌంటర్ టెర్రరిజం-అనుసరించాల్సిన వ్యూహం అన్న అంశంపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన కార్యక్రమంలో అక్కడ భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఒక ఆటలాగా వాడుకుంటున్న దేశాలకు ముకుతాడు వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితిలోని ప్రతినిధులు కేవలం తమ దేశ ప్రతినిధులుగానే కాకుండా, ప్రపంచ దృష్టికోణంతో ఆలోచించాలని ఆయన స్పష్టం చేశారు. ‘మంచి, చెడు అన్నది నీది.. నాది. కానీ, టెర్రరిజం అన్నది ప్రపంచానికే ప్రమాదకరమైంది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలకు హెచ్చరికలు చేయటంతోనే సరిపోదు. ఈ భూతాన్ని మొత్తంగా నిర్మూలించేందుకు నిర్మాణాత్మక చర్యలు అన్ని దేశాలు సమష్టిగా చేపట్టాలి’ అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులు ఎక్కడ శిక్షణ పొందుతున్నారో, ఎక్కడినుంచి వారికి నిధులు అందుతున్నాయో అన్న అంశాన్ని నిజాయితీగా పరిశీలించి వాటిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.