అంతర్జాతీయం

ఒలింపిక్స్‌కు జికా భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, మే 28: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్ ప్రభావం ఒలింపిక్ క్రీడలపై పడింది. అంతర్జాతీయ క్రీడోత్సవాల వేదిక మార్చడం లేదా పొడిగించడం ఏదొకటి చేయాలని 150 దేశాల వైద్య నిపుణులు, శాస్తవ్రేత్తలు, పరిశోధకులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ మేరకు వారంతా సంతకం చేసిన విజ్ఞాపనను ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపారు. ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 18 వరకూ రియో డి జెనిరియోలో ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. రోగం వచ్చిన తరువాత బాధపడేకంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అంతర్జాతీయ వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం వైద్యుల వాదనను తోసిపుచ్చింది. క్రీడలు వాయిదా లేదా మరోచోట నిర్వహించడం అన్నది సాధ్యంకాదని తేల్చిచెప్పేసింది.
జికా వైరస్ సోకిన దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉందన్న వైద్యులు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులు, పర్యాటకులు రియోకు తరలివస్తే వ్యాధి విశ్వవాప్తమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా, నార్వే, ఫిలిప్పీన్స్, జపాన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, టర్కీ, లెబనాన్‌సహా 150 దేశాల నిష్ణాతులైన వైద్యులు, శాస్తవ్రేత్తలు, పరిశోధకులు లేఖపై సంతకాలు చేశారు. ఒకపక్క జికా వైరస్ కబళిస్తుంటుంటే క్రీడా సంబరాలు చేసుకోవడం బాధ్యతారాహిత్యమే కాకుండా అనైతికమని ఆ లేఖలో విరుచుకుపడ్డారు. జికా వైరస్ పిల్లలు చిన్నతలలు, మెదడుతో పుట్టటం, విపరీతమైన జ్వరంతో మృత్యువాత పడడం వంటిని తేలిగ్గా తీసుకోవద్దని వారు హెచ్చరిస్తున్నారు.