అంతర్జాతీయం

పాక్‌పై ఆర్థిక, సైనిక ఆంక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 29: తాలిబన్, హక్కానీ గ్రూపు సహా ఉగ్రవాద ముఠాలకు మద్దతు అందించడాన్ని పాకిస్తాన్ కొనసాగించిన పక్షంలో దానిపై క్రమక్రమంగా దౌత్య, సైనిక, ఆర్థికపరమైన ఆంక్షలను విధించడానికి ఉద్దేశించిన చట్ట సవరణను అమెరికా సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ సెనేట్‌లో ప్రతిపాదించారు. మెక్‌కెయిన్ సెనేట్‌లో అత్యంత శక్తివంతమయిన ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీకి చైర్మన్. ఆయన ప్రతిపాదించిన అనేక సవరణలు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం కూడా పొందాయి. అంతేకాకుండా అఫ్గాన్ భద్రతా దళాలను బలోపేతం చేయాలని, హక్కానీ నెట్‌వర్క్, తాలిబన్ తదితర ఉగ్రవాద ముఠాలపై దాడులు చేయడానికి అమెరికా బలగాలకు అధికారాలు ఇవ్వాలని కూడా మెక్‌కెయిన్ ఆ సవరణలో ప్రతిపాదించారు. అలాగే ఈ ప్రతిపాదనలో భాగంగా భారత్ సహా ఈ ప్రాంతంలోని దేశాలతో కలిసి దౌత్యపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని కూడా ఆ సవరణలో మెక్‌కెయిన్ ప్రతిపాదించారు. అఫ్గాన్ భద్రతా దళాలకు తోడ్పాటు అందించడంతో సహా వివిధ రంగాల్లో భారత్ సహకారాన్ని మరింతగా తీసుకోవాలని కోరుతూ ఇదే చట్టానికి మరో సవరణను రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన సెనేటర్లు డాన్ సల్లివాన్, గారీ పీటర్స్, జాన్ కార్నిన్, మార్క్ వార్నర్ ప్రతిపాదించారు.