అంతర్జాతీయం

రష్యాపై ఆంక్షల బిల్లుపై త్వరలో ట్రంప్ సంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 29: రష్యాతోపాటు ఇరాన్, ఉత్తర కొరియాపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఈ వారం అమెరికా పార్లమెంట్ ఆమోదించిన చట్టంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో సంతకం చేయాలని యోచిస్తున్నారు. అమెరికా అధ్యక్ష భవనం (వైట్ హౌస్) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా పార్లమెంట్ ఆమోదిస్తే తప్ప రష్యాపై ఆంక్షలను రద్దు చేసేందుకు లేదా సడలించేందుకు వీలులేకుండా ట్రంప్‌ను ఈ చట్టం నిరోధిస్తోంది. ఈ చట్టానికి సంబంధించిన తొలి ముసాయిదాల్లోని కీలక అంశాలపై ట్రంప్ చర్చలు జరిపారని, ఈ చర్చల్లో వ్యక్తమైన ప్రతిస్పందనను ఆధారంగా చేసుకుని తుది ముసాయిదాను ఆమోదించడం జరిగిందని వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా పార్లమెంట్‌లోని ప్రతినిధుల సభ 419-3 ఓట్ల తేడాతో ఆమోదించిన ఈ బిల్లును రెండు రోజుల తర్వాత సెనేట్ కూడా భారీ మెజార్టీతో (98-2 ఓట్ల తేడాతో) ఆమోదించి వీటో చేసేందుకు అవకాశం లేకుండా చేసిన విషయం తెలిసిందే.