అంతర్జాతీయం

జర్మనీ నైట్‌క్లబ్‌లో కాల్పులు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్‌స్టాంగ్జ్(జర్మనీ), జూలై 30: దక్షిణ జర్మనీలోని ఓ నైట్‌క్లబ్‌పై ఇరాక్‌కు చెందిన ఓ సాయుధ వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరంచారు. ఎం-16 ఆటోమేటిక్ రైఫిల్‌తో క్లబ్‌లోకి ప్రవేశించిన ఈ వ్యక్తి ఓ చిన్న తగాదా తలెత్తడంతో కాల్పులకు ఒడిగట్టాడు. ఆ కాల్పుల్లోనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. వెంటనే రంగంలోకి ప్రవేశించిన పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆగంతకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయాలతోనే ఆస్పత్రిలో మరణించాడని ఓ ప్రకటనలో పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి వెనుక ఐసిస్ హస్తం కాని, ఉగ్రవాద హస్తం కానీ ఉండే అవకాశం లేదని, అలాంటి సంకేతాలేమీ కనిపించలేదని ప్రాసిక్యూటర్ జొహనె్నస్ జార్జ్ తెలిపారు.