అంతర్జాతీయం

బాడీగార్డుతో పారిపోవాలనుకున్న డయానా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 30: పారిస్‌లో జరిగిన కారు ప్రమాదంలో ప్రిన్స్ డయానా మరణించి 20 ఏళ్లు గడిచిపోయినా బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ చార్లెస్‌తో ఆమె విఫల వైవాహిక జీవితం, ఆమె ప్రేమకు సంబంధించిన కథనాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రిన్స్ చార్లెస్‌తో వైవాహిక జీవితంనుంచి తప్పించుకోవడానికి డయానా పీకల్లోతు ప్రేమలో పడిన తన బాడీగార్డు ఒకరితో పారిపోవాలనుకున్నట్లు ఆమె తన వాయిస్ కోచ్‌తో రహస్యంగా రికార్డు చేసిన వీడియోలను బట్టి తెలుస్తోంది. ఈ వీడియోలు ఇప్పుడు తొలిసారిగా బ్రిటన్‌లో ప్రసారం కాబోతున్నాయి. ప్రిన్స్ డయానా 1992-93 సంవత్సరాల మధ్య కెన్సింగ్‌టన్ ప్యాలెస్‌లో పీటర్ సెటెలెన్‌తో ఈ వీడియో టేప్‌లను రికార్డు చేశారు. వచ్చేవారం బ్రిటన్‌కు చెందిన చానెల్-4 ఒక డాక్యుమెంటరీలో భాగంగా తొలిసారి ప్రసారం చేయబోతోంది. తన అంగరక్షకుడు బ్యారీ మన్నాకీతో తాను ప్రేమలో పడిన విషయాన్ని ఈ వీడియోల్లో ఆమె అంగీకరించడమే కాకుండా అప్పట్లో కామిల్లా పార్కర్-బోవెల్స్‌తో ప్రిన్స్ చార్లెస్ ప్రేమ వ్యవహారం గురించి ఆయనతో చర్చించిన విషయాన్ని కూడా వెల్లడించింది. తనకు 24-25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒకరితో గాఢమైన ప్రేమలో పడినట్లు డయానా తెలిపింది. ‘నేను వీటన్నిటినీ వదిలిపెట్టి సంతోషంగా వెళ్లిపోవాలనుకుంటున్నాను.. అతను (మన్నాకీ) కూడా ఇది మంచి ఆలోచనేనని చెప్తూ వచ్చాడు’ అని డయానా ఆ వీడియో టేపుల్లో చెప్పినట్లు ‘సండే టైమ్స్’ పత్రిక ప్రచురించిన వీడియోలోని ముఖ్యాంశాలను బట్టి తెలుస్తోంది. అయితే మన్నాకీతో తనకు ఉన్నది కేవలం లైంగిక సం బంధం కాదని, అంతకు మించిన ప్రేమ అని డయానా స్పష్టం చేసింది. అయితే అతడ్ని ప్యాలెస్‌నుంచి బైటికి గెంటి వేశారని, అది తన జీవితంలో అతిపెద్ద దెబ్బ అని ఆమె చెప్పింది. ఆ తర్వాత మన్నాకీ ఓ మోటార్ బైక్ ప్రమాదంలో చనిపోయాడు. కాగా, చానెల్-4 ఏడు టేపులలోని ముఖ్యాంశాలను మాత్రమే తీసుకుంది. మొత్తం 12 టేపులుంటే మిగతా అయిదు కనిపించడం లేదని తెలుస్తోంది.