అంతర్జాతీయం

ఉ.కొరియా క్షిపణి పరీక్షకు అమెరికా ప్రతీకార చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జూలై 30: ఉత్తర కొరియా ఇటీవల జరిపిన ఖండాంతర క్షిపణి పరీక్షలకు ప్రతిస్పందనగా అమెరికా ఆదివారంనాడు రెండు సూపర్‌సానిక్‌బి-1బి బాంబర్ విమానాలతో కొరియా ప్రాంతం మీదుగా విన్యాసాలు నిర్వహించి తన బలాన్ని ప్రదర్శించిందని అమెరికా, దక్షిణ కొరియా వైమానిక దళాలు తెలిపాయి. అమెరికా ప్రధాన నగరాలపై దాడి చేయగల సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టక్ క్షిపణి ప్రయోగాన్ని మరోసారి శుక్రవారం విజయవంతంగా నిర్వహించినట్లు ఉత్తర కొరియా ప్రకటించడం, దీనిపై తీవ్రంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాకు గట్టి హెచ్చరిక చేయడం తెలిసిందే. శుక్రవారం జరిపిన క్షిపణి పరీక్షకు, అలాగే ఇంతకు ముందు ఈ నెల 3న జరిపిన హాంగ్‌సోంగ్-14 రాకెట్ ప్రయోగానికి నేరుగా ప్రతిస్పందన ఈ బి-1బి బాంబర్ విమానాల విన్యాసాలని అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది. ఆదివారం ఉదయం గువామ్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌నుంచి ఈ బాంబర్ విమానాలు వెళ్ల్లాయని, విన్యాసాల మధ్యలో జపాన్, దక్షిణ కొరియా యుద్ధ విమానాలు కూడా వచ్చి చేరాయని దక్షిణ కొరియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంత సుస్థిరతకు ఉత్తర కొరియా అతిపెద్ద ముప్పుగా ఉందని, అవసరమైతే ఏ క్షణంలోనైనా తాము ఎంచుకున్న ఏ ప్రదేశంపైనైనా దాడి జరిపి తీవ్రనష్టం కలిగించడానికి సిద్ధంగా ఉన్నామని పసిఫిక్ వైమానిక దళాల కమాండర్ జనరల్ టెర్రెన్స్ జె.ఓషౌగనెస్సే ఒక ప్రకటనలో పేర్కొన్నారు.