అంతర్జాతీయం

ఇది రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగోన్, ఏప్రిల్ 1: ఆంగ్‌సాన్ సూకీని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించాలన్న ప్రభుత్వ ఆలోచన రాజ్యాంగ వ్యతిరేకమని మయన్మార్ ఎంపీ లు అభ్యంతరం చెప్పడంతో అర్ధ శతాబ్దానికి పైగా సైనిక పాలనలో మగ్గిన దేశంలో దేశంలో జా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు కూడా కాకముందే సైన్యంతో ఘర్షణ మొదలైనట్లయింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సూకీ, ఆమె పార్టీ గత బుధవారం అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సూకీ అధ్యక్షురాలు కావడానికి రాజ్యాంగం ప్రకారం వీలు లేకపోయినప్పటికీ తానే దేశాన్ని పాలిస్తానని ఆమె హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే కొత్త ప్రభుత్వం సూకీకి ప్రత్యేక ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడం కోసం ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఒక వేళ ఈ బిల్లు గనుక ఆమోదం పొందినట్లయితే కొత్త కేబినెట్‌లో ఇప్పటికే నాలుగు మంత్రిత్వ పదవులు కలిగి ఉన్న సూకీకి తిరుగులేని అధికారాలు లభిస్తాయి. అయితే ఎగువ సభలో శుక్రవారం చర్చ సందర్భంగా సభలోని మిలిటరీ ఎంపీలు ప్రభుత్వ చర్యను రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా అభివర్ణించారు. ప్రభుత్వ ఆలోచన సలహాదారును, అధ్యక్షుడిని ఒకే స్థాయిలో ఉంచుతుందన్న అనుమానాలను కల్నల్ మీంట్ స్వే లేవనెత్తుతూ, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని, అందువల్ల రాజ్యాంగానికి అనుగుణంగా బిల్లును సవరించాలని సూచించారు. బిల్లులో సూకీ పేరును పేర్కొనడంపై మరో ఆర్మీ ఎంపీ కల్నల్ హ్లా విన్ ఆంగ్ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇది చట్టసభ, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మధ్య సమతౌల్యతను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. సైన్యమే రూపొందించిన రాజ్యాం గం ప్రకారం పార్లమెంటులోని మొత్తం స్థానాల్లో నాలుగో వంతు సీట్లు సైన్యానికి రిజర్వ్ చేయడం తెలిసిందే. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డి) భారీ విజయం సాధించడంతో చట్టసభలో దానికి తిరుగులేని మెజారిటీ లభించింది. ఈ కారణంగా ఎగువ సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లు విజయం సాధించింది కానీ, దిగువ సభతో పాటుగా పార్లమెంటు సంయుక్త సమావేశంలో కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది.