అంతర్జాతీయం

చైనా, ఐసిస్, సైబర్ దాడులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 1: తమ దేశానికి అత్యంత ప్రమాదకరమైన ముప్పుల్లో ఇసిస్ ఉగ్రవాద సంస్థ, వాతావరణ మార్పులని భారతీయులు భావిస్తుండగా, చైనా ఆ జాబితాలో మూడోస్థానంలో ఉందని అమెరికాకు చెందిన ‘ప్యూ రిసెర్చ్’ సంస్థ తాజాగా నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. భారత దేశంలో 66 శాతం ప్రజలు ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ సంస్థను ప్రధానమైన ముప్పుగా భావిస్తుండగా భూతాపం ప్రధానమైన ముప్పుగా భావిస్తున్నట్లు 47 శాతం మంది చెప్పడం గమనార్హం. సర్వే నిర్వహించిన 18 దేశాల్లో కూడా ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రధాన ముప్పుగా ఉండడం గమనార్హం. ఇవన్నీకూడా యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియా, అమెరికా ప్రాంతంలోనే ఉన్నాయి. కాగా, చైనాను ప్రధానమైన ముప్పుగా భావిస్తున్నట్లు 44 శాతం మంది భారతీయులు చెప్పినట్లు ఆ సర్వే వెల్లడించింది. సిక్కింలోని డోక్లామ్ ప్రాంతంలో భారత్, చైనా సైన్యాల మధ్య నెలరోజులుగా ఉద్రిక్తత కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముప్పు ఎక్కువగా ఉండే మూడు దేశాల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా అమెరికా (19శాతం), రష్యా (17 శాతం) ఉన్నాయ.
ప్రపంచంలో చాలాదేశాలు చైనాను ప్రధానమైన ముప్పుగా భావిస్తున్నాయని కూడా ఆ నివేదిక పేర్కొంది. దక్షిణ కొరియాలో అత్యధికంగా 83 శాతం మంది చైనాను ప్రధానమైన ముప్పుగా భావిస్తుండగా, ఆ తర్వాతి స్థానంలో వియత్నాం (80 శాతం) ఉంది. కాగా, అమెరికాలో 41 శాతం మంది చైనా పెత్తనాన్ని ముప్పుగా భావిస్తున్నారు. స్పెయిన్, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలు సైతం చైనా ప్రధానమైన ముప్పుగా భావిస్తున్న వాటిలో ఉన్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాల్లో అత్యధికులు ఐసిస్, భూతాపాలు ప్రధానమైన ముప్పులుగా భావిస్తున్నప్పటికీ, దాదాపు 52 శాతం మంది సైబర్ దాడుల గురించి కూడా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హమని ఆ సర్వే పేర్కొంది. అయితే ప్రపంచ ఆర్థిక పరిస్థితి, శరణార్థుల సమస్య లేదా అమెరికా, రష్యా ఆధిపత్యంపై చాలా తక్కువమంది ఆందోళన వ్యక్తం చేయడం విశేషం.