అంతర్జాతీయం

హెచ్-1బి దరఖాస్తుల్లో భారతీయులే అధికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 1: అగ్రరాజ్యం అమెరికాలో పనిచేయాలన్న మోజు రోజురోజుకూ పెరుగుతోంది. హెచ్-1బి వీసా పొందిన ఉద్యోగి సగటు జీతం చూస్తే కళ్లు తిరుగుతాయి. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో పనిచేసేందుకు హెచ్-1బి వీసాల కోసం గడచిన 11 సంవత్సరాల కాలంలో దరఖాస్తు చేసుకున్న భారతీయుల సంఖ్య అక్షరాల 21 లక్షలు. యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తాజా నివేదిక ప్రకారం వారి సగటు జీతం 92,317 అమెరికన్ డాలర్లు. ఈ నివేదిక ప్రకారం 2007నుంచి 2017, జూన్ వరకు 34లక్షల మంది హెచ్-1బి వీసాలకోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో భారత్‌నుంచి దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 21 లక్షలు. వీరిలో 26 లక్షల మందికి అమెరికా హెచ్-1బి వీసాలను మంజూరు చేసింది. హెచ్-1బి వీసాలకోసం దరాఖాస్తు చేసుకున్న వారిలో చైనాకు చెందిన వారు 2,96,313 మంది ఉండడం విశేషం. ఫిలిప్పీన్స్ నుంచి 85,918, దక్షిణకొరియా నుంచి 77,359, కెనడా నుంచి 68,228మంది ఉన్నారు.