అంతర్జాతీయం

అది జీవకోటికి అనువైంది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 1: సౌర వ్యవస్థకు ఆవల నివాసయోగ్యమైన జోన్‌లో ఉన్న మనకు అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం అయిన ప్రాక్సిమా-బి జీవకోటి ఉండడానికి అనువైనది కాకపోవచ్చని, ఎందుకంటే తన వాతావరణంపై దానికి పట్టులేదని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా) శాస్తవ్రేత్తలు అంటున్నారు. స్థిరమైన వాతావరణం లేకపోవడంవల్ల ఈ నక్షత్రం హానికరమైన రేడియేషన్ దాడికి గురికావడంతో ప్రాణులు నివసించడానికి ఈ గ్రహం సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని వారంటున్నారు. కేవలం నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్రాక్సిమా-బి సౌర కుటుంబం వెలుపల మనకు అత్యంత చేరువగా ఉన్న నక్షత్రం. అయితే అది ఇప్పటివరకు తన ఒరిజినల్ నక్షత్రం ముందునుంచి దాటి వెళ్లడం చూడలేదు కనుక దాని వాతావరణం గురించి తెలుసుకోవడానికి మామూలుగా ఉపయోగించే విధానానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో శాస్తవ్రేత్తలు అది జీవకోటికి అనువైనదా కాదా అని తెలుసుకోవడానికి కంప్యూటర్ మోడల్స్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఒకవేళ మన భూమే గనుక మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారి చుట్టూ పరిభ్రమించి ప్రాక్సిమా-బి గనుక ఒరిజినల్ నక్షత్రంగా ఉంటే ఏమవుతుందనేది ఆ మోడల్స్‌లో ఒకటి. మండే అగ్నిగోళంగా ఉండే ఆ నక్షత్రానికి దగ్గర్లో మన భూమి వాతావరణం మన జాలదని ‘ది ఆస్ట్ఫ్రోజికల్ జర్నల్ లెటర్స్’ పత్రికలో ప్రచురించిన ఆ అధ్యయనం పేర్కొంటోంది. కేవలం ప్రాక్సిమా-బి కక్ష్య తన ఒరిజినల్ నక్షత్రానికి దూరంగా, నివాసానికి అనువైన జోన్‌లో ఉన్నంతమాత్రాన అది ప్రాణికోటి ఉండడానికి అనువైనదని అర్థం కాదని అమెరికాలోని నాసాకు చెందిన గోడ్డార్డ్ స్పేస్ఫ్లైట్ సెంటర్‌లో అంతరిక్ష శాస్తవ్రేత్తగా పని చేస్తున్న కాథరిన్ గార్సియా-సేజ్ అభిప్రాయపడ్డారు. ఆ గ్రహంపై నీరున్నట్లు కానీ, దాని కక్ష్యలో వాతావరణం మనగలదని కానీ చెప్పలేమని కూడా ఆమె అన్నారు.