అంతర్జాతీయం

అంగుళం కూడా వదులుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 1: తమకు చెందిన భూభాగాన్ని అంగుళం కూడా వదులుకునే పరిస్థితి లేదని, అన్ని విధాలుగా ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుంటామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఉద్ఘాటించారు. పొరుగు దేశాలతో ప్రాదేశిక వివాదాలు తీవ్ర స్థాయిని సంతరించుకున్న నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరిక స్వరాన్ని వినిపించడం గమనార్హం. అన్ని రకాలుగా దాడులను చిత్తు చేయడంతోపాటు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోగలిగే సత్తా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఉందని ఆయన తెలిపారు. సిక్కింలోని డోక్లామ్‌పై భారత్‌తో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో మాట్లాడిన జిన్‌పింగ్ ‘మా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఏ చర్యనూ సహించబోం. అలాగే భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను తిరుగులేని విధంగా కాపాడుకుంటాం’ అని తెలిపారు. సిక్కిం వివాదాన్ని ఆయన నేరుగా ప్రస్తావించకపోయినా ఎలాంటి పరిణామాన్నైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని పిఎల్‌ఏ పిలుపునిచ్చారు. అంతిమ విజయం తమదేనన్న ధీమాతోనే ఎప్పటికప్పుడు ఈ యుద్ధ సన్నద్ధతను పెంపొందించుకోవాలని కోరారు. చైనా ప్రజలు శాంతినే కోరుకుంటున్నారని తమకు దురాక్రమణ ఆకాంక్ష లేదని, అలాగే రాజ్యవిస్తరణ లక్ష్యమూ లేదని జిన్‌పింగ్ తెలిపారు. అయితే తమపై ఎవరు దాడిచేసినా తిప్పికొట్టగలిగే ధీమా తమకు ఉందన్నారు. గ్రేట్ హాల్ ఆఫ్ చైనాలో జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్ మాట్లాడారు. అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన ప్రధాని లీ కెకియాంగ్, ఇతర పార్టీ సీనియర్ నేతలు, సైనికాధికారులు హాజరయ్యారు. శత్రు దేశాల దాడులను తిప్పికొట్టగలిగే సామర్థ్యం తమ సైనిక దళాలకు ఉందని జిన్‌పింగ్ చెప్పడం గత మూడు రోజుల్లో రెండోసారి. పిఎల్‌ఏ 90వ వార్షికోత్సవ సందర్భంగా కూడా దేశ సైనిక సత్తా గురించి ఆయన మాట్లాడిన విషయం తెలిసిందే. పరిస్థితులు ఎంతగా మారినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా చైనా సైనిక దళం నిరంతరం ఆధునికతను సంతరించుకుంటూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సిపిసి సెంట్రల్ కమిటీ అధికారాన్ని పరిరక్షించుకోవాలని దాని నిర్ణయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి వ్యూహాలను మరచిపోవాలని, ప్రతికూల పరిణామాలను అధిగమించే సత్తాను సంతరించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అవగతం చేసుకుని చైనా సైన్యం తన సామర్థ్యాన్ని ఇనుమడింపజేసుకోవాలన్నారు.

చిత్రం.. గ్రేట్ హాల్ ఆఫ్ చైనాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న జీ జిన్‌పింగ్