అంతర్జాతీయం

పదినెలలే అబ్బాసీ అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఆగస్టు 3: పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన షాహిద్ ఖకన్ మరో పది నెలలు పదివిలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పదినెలలు పదవీ కాలం ఉన్న మాజీ ప్రధాని షరీఫ్‌ను పాక్ అత్యున్నత న్యాయస్థానం పనామా పేపర్స్ కేసులో పదవికి అనర్హుడిగా తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ప్రధాని పదవిని తన సోదరుడు, పంజాబ్ ముఖ్యమంత్రి షహబాజ్‌కు అప్పజెబుదామని మొదట నవాజ్ షరీఫ్ అనుకున్నారు. అంతవరకు ఆపద్ధర్మంగా 45 రోజుల పాటు షాహిద్‌ను ప్రధాని పదవిలో కొనసాగించాలన్నది షరీఫ్ వ్యూహం. ఈమేరకు పిఎంఎల్-ఎన్ పార్టీ నాయకులతో షరీఫ్ సమావేశమై ప్రధాని పదవిలో ఎవరిని నియమించాలన్న దానిపై చర్చలు జరిగాయి.