అంతర్జాతీయం

సైన్యం వల్లే పాక్‌కు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 3: పాకిస్తాన్ పరిస్థితులు ఎప్పుడు అదుపుతప్పినా వాటిని గాడిలోపెట్టింది సైనిక పాలకులేనని మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో వచ్చిన సైనిక పాలనలన్నీకూడా సరైనవేనంటూ గట్టిగా సమర్ధించుకున్నారు.‘పౌర ప్రభుత్వాలు దేశాన్ని గాడితప్పిస్తే సైనిక పాలకులు పరిస్థితులను చక్కదిద్ది మళ్లీ గాడిలోపెట్టారు’అని ముషారఫ్ అన్నారు. ఇటీవలే పదవీచ్యుతుడైన నవాజ్ షరీఫ్ పూర్తిగా భారత్‌కు అమ్ముడుపోయారని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించిన ముషారఫ్ ఈ మాటల్లో తన ఉద్దేశం ఏమిటోమాత్రం స్పష్టం చేయలేదు. దుబాయిలో ఉంటున్న ముషారఫ్ బిబిసి ఉర్దూ చానల్‌కు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించారు. పాకిస్తాన్ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వారు దేశ ద్రోహులేనని అలాంటి వారిని చంపేయాల్సిందేనని ముషారఫ్ తీవ్ర స్వరంతో అన్నారు. 1999లో తాను చేసిన సైనిక తిరుగుబాటును సమర్ధించుకున్న ఆయన పాకిస్తాన్‌ను రక్షించడం కోసమే ఆ తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని చెప్పుకున్నారు. దేశాన్ని రక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా విస్మరించవచ్చని తెలిపారు. అయితే అప్పట్లో పాకిస్తాన్‌కు వచ్చిన ముప్పు ఏమిటన్నది కూడా ఆయన వివరించలేదు. పౌర ప్రభుత్వాలను తొలగించి పాకిస్తాన్‌లో సైనిక పాలకులు పగ్గాలు చేపట్టిన ప్రతిసారీ మేలే జరిగిందని ముషారఫ్ తెలిపారు. సైనిక పాలనలో సాధించిన అభివృద్ధి పౌర ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమైపోయిందని ముషారఫ్ పేర్కొన్నారు. 1971లో పాకిస్తాన్ ముక్కలు కావడానికి అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో కారణమని పేర్కొన్న ముషారఫ్ జనరల్ జియాఉల్‌హక్ తన హయాంలో అనుసరించిన అఫ్గనిస్తాన్ విధానాన్ని సమర్ధించారు. పనామా పత్రాల అవినీతి కేసులో ప్రధాన మంత్రి పదవి నుంచి నవాజ్ షరీఫ్‌ను తొలగిస్తే పాక్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ముషారఫ్ ఓ వీడియోను పోస్టు చేశారు. అయితే ఆ ప్రకటనపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. 70 ఏళ్ల క్రితం స్వాతంత్య్రాన్ని పొందిన పాకిస్తాన్‌లో సైనిక ప్రభుత్వాలే ఎక్కువగా దేశాన్ని పాలించాయన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం అన్నారు.