అంతర్జాతీయం

ఉత్తర కొరియాను దారికితెద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, ఆగస్టు 6: ఉత్తర కొరియాను దౌత్యపరంగా ఎదుర్కొని దాన్నుంచి తలెత్తే అణు ముప్పును నిరోధించేందుకు రష్యా, చైనాతో కలిసి పనిచేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉత్తర కొరియాపై ఆర్థిక ఆంక్షలను విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రెండు దేశాలు సమర్థించడాన్ని ఆయన హర్షించారు. ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఖండాంతర క్షిపణి పరీక్షలను నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తూ ఐరాస తీసుకున్న నిర్ణయాన్ని రష్యా, చైనాలు బలపరచడం సానుకూల పరిణామంగా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర కొరియాను పూర్తిగా దారికి తెచ్చేందుకు ఈ రెండు దేశాలతోపాటు ఇతర మిత్రదేశాలతోనూ క్రియాశీలకంగా పనిచేయడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని కూడా ఆ ప్రకటనలో తెలిపింది. ఏకగ్రీవంగా ఐరాస ఆమోదించిన ఈ ఆంక్షల తీర్మానానికి అనుకూలంగా పదిహేను ఓట్లు వచ్చాయి. రష్యా, చైనాలు కూడా బలపరచడంతో దీని ఏకగ్రీవ ఆమోదం సాధ్యమైంది. ఈ ఓటింగ్‌కు ముందే ఉత్తర కొరియా నాయకత్వంతో మాట్లాడిన ఐరాస రష్యా రాయబారి అణు క్షిపణి కార్యక్రమాలను రద్దుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఉత్తర కొరియాపై తలపెట్టిన ఈ రకమైన తీర్మానాలను రష్యా, చైనాలు అడ్డుకున్న నేపథ్యంలో ఈ రెండు దేశాలనుంచే తాజాగా సానుకూల పరిణామాలు రావడం అంతర్జాతీయ శాంతికి శుభసూచకంగా భావిస్తున్నారు. తాజా ఆంక్షలవల్ల ఉత్తర కొరియా వార్షిక ఎగుమతుల ఆదాయం దాదాపు మూడు బిలియన్ల మేర తగ్గిపోతుంది.