అంతర్జాతీయం

నెహ్రూ చేసిన తప్పు మళ్లీ చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 8: డోక్లామ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ దేశ మీడియా హెచ్చరించింది. చైనా అధికార మీడియా అయిన గ్లోబల్ టైమ్స్‌లో భారత్‌ను రెచ్చగొట్టే వ్యాసం రాసింది. గత రెండు నెలలుగా భారత్‌ను కించపరుస్తూ, భారత శక్తిని తక్కువ చేస్తూ, రెచ్చగొట్టేవిధంగా పలు వ్యాసాలు రాసిన గ్లోబల్‌టైమ్స్ సోమవారం మరో వ్యాసం రాసింది. ‘సరిహద్దులో ఉద్రిక్తతలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం చైనా నుంచి వస్తున్న హెచ్చరికలను ఇదేవిధంగా బేఖాతరు చేస్తూపోతే చైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవలసి వస్తుంది. 1962లో భారత-చైనా సరిహద్దుల్లో భారత్ పదే పదే రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించింది. చైనా ఏరకమైన చర్యకు దిగదని అప్పటి జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం భావించింది. కానీ ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు చైనా స్వదేశంలో ప్రకృతి విపత్తులపైన దృష్టి పెట్టింది’ అని వ్యాఖ్యానించింది. నాడు నెహ్రూ ప్రభుత్వం తక్కువ అంచనా వేయటంవల్లే యుద్ధం సంభవించిందని. 55 సంవత్సరాలు పూర్తయినా భారత ప్రభుత్వ ధోరణి మాత్రం మారలేదని ఘాటుగా పేర్కొంది. భారత్, భూటాన్, చైనా సరిహద్దుల్లోని డొక్లామ్ వద్ద చైనా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని భారత బలగాలు అడ్డుకోవటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న సంగతి తెలిసిందే.