అంతర్జాతీయం

డోక్లామ్‌పై రాజీ ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 10: డోక్లామ్ ప్రతిష్టంభన విషయంలో చైనా ఎలాంటి రాజీ పడబోదని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ)కి చెందిన విశే్లషకులు స్పష్టం చేశారు. అంతేకాదు డోక్లామ్ చైనా భూభాగమని, తమ భూభాగంలోకి సైన్యాలను పంపడం ద్వారా భారత ప్రభుత్వం చైనా కృతనిశ్చయాన్ని తప్పుగా అంచనా వేసిందని చైనాలో పర్యటిస్తున్న భారత పత్రికా ప్రతినిధుల బృందంతో మాట్లాడిన వారు అన్నారు. సిక్కిం సెక్టార్ సమీపంలోని డోక్లామ్‌లో చైనా సైన్యం జరుపుతున్న రోడ్డు నిర్మాణాన్ని భారత సైన్యాలు అడ్డుకోవడంతో మొదలైన ప్రతిష్టంభన 50 రోజులు గడిచినప్పటికీ అలాగే కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ భూభాగంలోపలే రోడ్డు నిర్మాణం చేస్తున్నామని చైనా వాదిస్తూ డోక్లామ్‌నుంచి భారత సైన్యాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. అయితే అది తమ భూభాగమని భూటాన్ అంటుండగా, డోక్లామ్ విషయంలో భూటాన్‌కు తమతో ఎలాంటి వివాదం లేదని చైనా అంటోంది. అయితే, డోక్లామ్ విషయంలో భారత్ దుందుడుకు చర్య పట్ల చైనా ప్రభుత్వం, ప్రజలు, సైన్యం ఆగ్రహంగా ఉన్నట్లు భారత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన చైనా మిలిటరీ నిపుణులు, దక్షిణాసియా విశే్లషకులు చెప్పారు. ఇప్పటిదాకా చైనా ‘దాడి’ అనే పదాన్ని ఉపయోగించలేదు, కేవలం ‘చొరబాటు’ అనే పదానే్న ఉపయోగించింది. చైనా సుహృద్భావానికి అదే నిదర్శనం’ అని సీనియర్ సైనికాధికారి ఝోవు బో అన్నారు. సమస్య శాంతియుతంగా పరిష్కారమవుతుందని తాము ఆశిస్తున్నామని, అయితే ఈ విషయంలో చైనా ప్రభుత్వం, మిలటరీ రాజీ పడడానికి ఎలాంటి అవకాశం లేదని అన్నారు. అందువల్ల రెండు దేశాల ప్రజలు సుఖంగా ఉండాలంటే భారత్ బేషరతుగా వైదొలగాలని ఆయన స్పష్టం చేశారు. అకాడమీ ఆఫ్ మిలిటరీ సైనె్సస్‌కు చెందిన ‘సెంటర్ ఆన్ చైనా-అమెరికా రిలేషన్స్’ డైరెక్టర్ ఝావో జియావోఝు కూడా దాదాపు ఇదే రీతిలో మాట్లాడారు. చైనా విదేశాంగ శాఖ కూడా కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన రోజునే ఝావో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.