అంతర్జాతీయం

పాక్ ‘మదర్’ ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి, ఆగస్టు 10: పాకిస్తాన్ ‘మదర్ థెరిస్సా’గా పేరుగాంచిన డాక్టర్ రూత్ ఫా కరాచీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం కన్నుమూశారు. 87ఏళ్ల ఫా వయస్సు పైబడడంతో వచ్చే అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. డాక్టర్ ఫా 1960లో తొలిసారిగా కరాచీలో కాలుపెట్టారు. అక్కడ కుష్ఠువ్యాధితో బాధపడుతున్నవారికి చూసి వారికి సేవలు చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. 1962లో కరాచీలో మేరీ ఎడిలైడ్ లెప్రసీ సెంటర్‌ను ప్రారంభించి, ఆ సంస్థద్వారా దాదాపు 50వేల మంది రోగులకు సేవలందించారు. పాకిస్తాన్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ సంస్థ శాఖలను ప్రారంభించారు. గిల్గిత్ బలూచిస్తాన్‌లో సైతం ఈ శాఖ ఉండటం గమనార్హం. డాక్టర్ ఫా చేసిన సేవలకు గుర్తింపుగా 1996లో ‘కుష్ఠు వ్యాధి రహిత దేశం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మన్ననలను పాకిస్తాన్ అందుకోగలిగింది. 1929లో జర్మనీలో జన్మించిన డాక్టర్ రూత్ ఫా రెండవ ప్రపంచ యుద్ధం నాటి భయంకర పరిస్థితులను చవిచూశారు. చిన్ననాటి నుంచే సేవాభావాలు కలిగివున్న ఫా ‘సొసైటీ ఆఫ్ డాటర్స్ ఆఫ్ ది హర్ట్ ఆఫ్ మేరీ’ సొసైటీలో సభ్యురాలిగా చేరారు. అప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశానికి వచ్చి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వీసా సమస్యలతో ఆమె కరాచీలోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న రోగులకు సేవ చేయడం ప్రారంభించి ఇక అక్కడే స్థిరపడిపోయారు. 29ఏళ్ల వయస్సులో కరాచీలో కాలుమోపిన డాక్టర్ ఫా అనేక అవార్డులను సైతం దక్కించుకున్నారు. 1979లో పాకిస్తాన్‌లోని రెండవ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హిలాల్-ఇ-ఇమ్తియాజ్ అవార్డును, 1989లో హిలాల్-ఇ-పాకిస్తాన్ అవార్డును పొందారు. 2015లో కరాచీ జర్మన్ కాన్సులేట్ స్ట్ఫార్ మెడల్‌తో సత్కరించింది. డాక్టర్ ఫా అంత్యక్రియలు ఈ నెల 19న జరగనున్నాయి.