అంతర్జాతీయం

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలా, ఆగస్టు 11: ఫిలిప్పీన్స్‌లో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత కలిగిన భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.28 గంటలకు లియాన్ పట్టణం తీరానికి దగ్గర్లో సముద్రంలో 173 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు ప్రభుత్వ అదికారులు తెలిపారు. దీని తీవ్రత 6.2 పాయింట్లుగా యుఎస్ జియాలజికల్ సర్వే అంచనా వేసింది. అయితే భూకంపం చాలా లోతులో సంభవించినందున పెద్దగా ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదని ఆ సంస్థ డైరెక్టర్ రేనాటో సోలిడమ్ ప్రభుత్వ టీవీకి చెప్పారు. భూకంపం కేంద్రానికి అత్యంత దగ్గరగా ఉన్న లియాన్ పట్టణంలో కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వార్తలు రాలేదని సహాయ, పునరావాస విభాగం అధికారి ఒకరు చెప్పారు. అయితే దేశ రాజధాని మనీలా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భవనాలు మాత్రం భూకంపం తీవ్రతకు ఊగిపోయాయి.