అంతర్జాతీయం

రణరంగమైన వర్జీనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 13: అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో శే్వత జాతీయవాదుల ప్రదర్శన హింసాత్మకంగా మారింది. శే్వతజాతీయ వాదులకు, వారిని వ్యతిరేకించే వారి మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందగా మరో 19 మంది గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘర్షణలతో రాష్ట్రంలోని చార్లొట్టీస్‌విల్లే పట్టణం అట్టుడికిపోయింది. జనంపైకి కారు దూసుకు పోవడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, ప్రదర్శన ప్రాంతంలో ఓ గస్తీ హెలికాప్టర్ కూలిపోవడంతో ప్రదర్శన వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్న ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు. అమెరికా అంతర్యుద్ధం సమయంలో సమాఖ్య సైన్యంలో కమాండర్‌గా పని చేసిన ఓ వ్యక్తి విగ్రహాన్ని చార్లొట్టీస్‌విల్లే పార్కునుంచి తొలగించాలని అధికారులు నిర్ణయించారు. పట్టణంలోని కాలేజి టౌన్ ప్రాంతంలో ఉన్న పార్కులో కమాండర్ రాబర్ట్ ఇ లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని అక్కడినుంచి తొలగించాలన్న అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శే్వతజాతీయ వాదులు శనివారం ‘యునైట్ ది రైట్’ పేరుతో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన జరపాలని నిర్ణయించారు. ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలలనుంచి పెద్ద సంఖ్యలో జనం చార్లొట్టీస్‌విల్లే పట్టణానికి చేరుకున్నారు. అదే సమయంలో ఈ శే్వతజాతీయవాదులను వ్యతిరేకిస్తున్న మరో వర్గం వారితో ఘర్షణకు దిగింది. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో అధికారులు అత్యవసర పరిస్థితి విధించారు. పెద్ద సంఖ్యలో సాయుధ పోలీసులను ఆ ప్రాంతంలో మోహరించారు.
కాగా, ఈ ఘటనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు నేతలు తీవ్రంగా ఖండించారు. అమెరికా సమాజంలో ఇలాంటి విద్వేషపూరిత హింసాత్మక ఘటనలకు ఎంతమాత్రం తావు లేదని ప్రస్తుతం న్యూజెర్సీలోని తన గోల్డ్ రిసార్ట్‌లో సెలవులు గడుపుతున్న ట్రంప్ విలేఖరులతో అన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇలాంటి ఘటనలు దేశంలో చాలాకాలంగా జరుగుతున్నాయని ఆయన అంటూ, వీటికి ముగింపు పలికి తీరాల్సిన అవసరం ఉందన్నారు.
ఘర్షణలు తగ్గుముఖం పడుతున్న సమయంలో అనుకోని పరిణామం చోటుచేసుకొంది. వేగంగా వచ్చిన ఓ కారు జనాన్ని ఢీకొట్టి ఏమి జరుగుతోందో తెలుసుకొనే లోగానే అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయింది. ఈ ఘటనలోఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడినట్లు ‘వాషింగ్టన్ పోస్టు’ పత్రిక తెలిపింది. కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అలాగే నిరసన ప్రదర్శన జరిగే స్థలానికి దగ్గర్లో ఓ హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రదర్శన వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

చిత్రం.. ఘర్షణల్లో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు