అంతర్జాతీయం

ఇండోనేసియాలో తీవ్ర భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, ఆగస్టు 13: ఇండోనేసియాలోని సుమిత్రా దీవిలో ఆదివారం తీవ్రమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. అయితే దీనివల్ల సునామీ వచ్చే ప్రమాదం లేదని అధికారవర్గాలు ప్రకటించాయి. భూకంప తీవ్రతకు ఇళ్లల్లో ఉన్నవారు భయకంపితులయ్యారు. ఉదయం 10.08 గంటలకు సంభవించిన ఈ భూకంపం భూమికి 35 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైనట్టు తెలిపారు. అమెరికా జియోలాజికల్ సర్వే శాఖ వివరాల ప్రకారం పశ్చిమ బెంగ్‌కులులో ప్రకంపనలు వచ్చాయన్నారు. ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సునామీ వచ్చే ఆస్కారం లేదని ఇండోనేసియా వాతావరణ, భూగోళశాస్త్ర విభాగం అధికారి మొచ్చామాడ్ రియాదీ స్పష్టం చేశారు.